ఎనోకి మష్రూమ్‌ ఆమ్లెట్‌

ఒక ప్రత్యేక రకమైన మష్రూమ్‌ ఇది. రుచికి మాంసంలా ఉంటుంది. దీంతో తయారుచేసే ఆమ్లెట్‌ చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు.

Updated : 12 Dec 2021 05:28 IST

ఒక ప్రత్యేక రకమైన మష్రూమ్‌ ఇది. రుచికి మాంసంలా ఉంటుంది. దీంతో తయారుచేసే ఆమ్లెట్‌ చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు.

కావాల్సినవి: ఎనోకి పుట్టగొడుగులు- 200 గ్రా., గుడ్లు- మూడు, సోయాసాస్‌- అర చెంచా, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), నూనె- సరిపడా.

తయారీ: పుట్టగొడుగుల కొనలను కత్తిరించాలి. గుత్తులుగా ఉండే వాటిని ఓ గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఆ తర్వాత వేరుచేసి కొద్దిగా ఉప్పు చల్లి అయిదు నిమిషాలు నానబెట్టాలి. మరో గిన్నెలో గుడ్లు పగలగొట్టి పోయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సోయాసాస్‌ వేసి బాగా కలపాలి. తర్వాత పొయ్యి మీద నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి మష్రూమ్స్‌ను పువ్వులాగా వృత్తాకారంలో వేయాలి. దానిపై మరికాస్త నూనె వేయాలి. మష్రూమ్స్‌ నుంచి నీళ్లు బయటకు వచ్చి, పుట్టగొడుగులు వేగినట్లు అనిపించినప్పుడు గుడ్డు మిశ్రమాన్ని వాటిపై పోసి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఆమ్లెట్‌ను మరోవైపు తిప్పి వేయించాలి. అంతే వేడి వేడి ఎనోకి మష్రూమ్‌ ఆమ్లెట్‌ రెడీ. చిన్నారులకు చేసిపెడితే ఇష్టంగా తింటారు. ఇందులో పోషకాలూ ఎక్కువే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని