బ్రెడ్‌ మంచూరియా

బ్రౌన్‌ బ్రెడ్‌ పొడి, క్యారెట్‌ తురుము- అర కప్పు చొప్పున, సన్నగా తరిగిన క్యాబేజీ- కప్పు, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా చొప్పున, మొక్కజొన్న పిండి- పావు కప్పు,....

Published : 23 Jan 2022 00:54 IST

కావాల్సినవి: బ్రౌన్‌ బ్రెడ్‌ పొడి, క్యారెట్‌ తురుము- అర కప్పు చొప్పున, సన్నగా తరిగిన క్యాబేజీ- కప్పు, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా చొప్పున, మొక్కజొన్న పిండి- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు- మూడు, పచ్చిమిర్చి- ఒకటి (నిలువుగా చీల్చినవి), ఉల్లికాడల తరుగు- నాలుగు పెద్ద చెంచాలు, టొమాటో సాస్‌- రెండు పెద్ద చెంచాలు, క్యాప్సికమ్‌ ముక్కలు- పావు కిలో, చిల్లీసాస్‌, మొక్కజొన్న పిండి- చెంచా చొప్పున, వెనిగర్‌, సోయాసాస్‌- పెద్ద చెంచా,  మిరియాలు- పావు చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: పెద్ద గిన్నెలో బ్రెడ్‌ పొడి, క్యాబేజీ, క్యారెట్‌ తురుము, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, మొక్కజొన్న పిండి, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపాలి. దీన్ని మెత్తగా చపాతీ పిండిలా చేసి పక్కన పెట్టుకోవాలి. చేతికి నూనె రాసుకుని గుండ్రంగా చిన్న చిన్న బంతులను సిద్ధం చేయాలి. కాగే నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఈ బాల్స్‌ను వేయించాలి. ఆ తర్వాత వీటిని టిష్యూ కాగితంపై వేసి పక్కన పెట్టాలి. 

పొయ్యి మీద కడాయి పెట్టి అది వేడయ్యాక నూనె పోసి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. క్యాప్సికమ్‌ ముక్కలనూ జత చేయాలి. టొమాటో సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌, మిరియాలు, ఉప్పును జోడించాలి. సాస్‌ చిక్కగా మారేవరకు పెద్ద మంటపై కలుపుతూ ఉండాలి. చెంచా మొక్కజొన్న పిండిలో పావు కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని కూరగాయల్లో కలపాలి. గ్రేవీ కొద్దిగా చిక్కగా, అయ్యే వరకు నిరంతరం కలుపుతూనే ఉండాలి. వేయించి పెట్టుకున్న మంచూరియన్‌ బాల్స్‌, కొద్దిగా ఉల్లి కాడల తరుగు వేసి కలపాలి. చివరగా తరిగిన ఉల్లి కాడలతో అలంకరిస్తే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని