పైనాపిల్‌తో ఫ్రైడ్ రైస్...!
కావాల్సినవి: పైనాపిల్ ముక్కలు- రెండు కప్పులు, అన్నం- కప్పున్నర, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, సెలరీ/కొత్తిమీర తరుగు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, బఠానీలు, మొక్కజొన్న గింజలు- పావు కప్పు చొప్పున, నూనె- నాలుగు పెద్ద చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- పది, అల్లం తరుగు- పెద్ద చెంచా, ధనియాల పొడి, పసుపు, కారం- పావు చెంచా చొప్పున, సోయాసాస్- చెంచా, ఉప్పు- తగినంత, తెల్లమిరియాల పొడి- అర చెంచా, పచ్చి మిర్చీ- రెండు.
తయారీ: పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారీకి పలుచటి అడుగు ఉండే వోక్ (డబ్ల్యూఓకే) అనే ప్రత్యేకమైన కడాయి వాడతారు. (ఇది లేకపోతే మామూలు కడాయిలోనూ చేసుకోవచ్చు.) కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, సెలరీ/కొత్తిమీర, పచ్చిమిర్చీ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, మొక్కజొన్న గింజలు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా మగ్గించాలి. త్వరగా చేసుకోవాలంటే క్యారెట్, బఠానీలు, కార్న్‌లను ముందుగా ఉడికించి వేసుకోవచ్చు లేదా తాజాగా ఫ్రై చేసుకునేటప్పుడు వేస్తే మంట చిన్నగా పెట్టి ముక్కలు మెత్తగా అయ్యేవరకు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి, సోయాసాస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంట తగ్గించి అన్నం వేసి కలపాలి. ఉప్పు, కారం సరిచూసుకుని వేడి వేడిగా వడ్డించాలి.
జాగ్రత్తలు... సోయాసాస్ ఎక్కువైతే వగరుగా అనిపిస్తుంది. కూరగాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మంట పెద్దగా ఉండాలి. అన్నం కలిపాక మంట తగ్గించాలి. వీలైతే అన్నం గంట ఫ్రిజ్‌లో పెట్టి ఆ తర్వాత ఫ్రై చేయడానికి వాడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది