Published : 06 Feb 2022 01:02 IST

మూడు పప్పుల వడ..

కావాల్సినవి:  మినప్పప్పు, శనగపప్పు, పెసర్లు- 50 గ్రాముల చొప్పున, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- పది, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, కారం, మెంతులు- పావు చెంచా  చొప్పన, పుదీనా- పావు కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు,  పచ్చిమిర్చీ- రెండు (చిన్నగా కోసుకోవాలి), ఉల్లిపాయ- ఒకటి (ముక్కలు), గరంమసాలా- పావు చెంచా, మిరియాలు- పావు చెంచా.

తయారీ:  పప్పులన్నింటినీ దాదాపు నాలుగు గంటలు నానబెట్టాలి.  ఆ తర్వాత కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇందులో పై చెప్పిన పదార్థాలన్నింటిని చేర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.  ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి కాగనివ్వాలి.  ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని చేతికి నూనె రాసుకుని వడల్లా చేసి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. సాయంత్రాలు చిన్నారులకు చేసి పెడితే ఇష్టంగా తింటారు.

- జి. జ్యోతిశ్రీనివాస రావు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు