బాగా చితక్కొడితే.. సూరత్ జొన్న
సాధారణంగా ఏదైనా ప్రత్యేక వంటకం చేయాలంటే... చాలా పని ఉంటుంది. దినుసులు సిద్ధం చేసుకోవాలి. అన్నింటినీ నూరి పెట్టుకోవాలి. బాగా వండాలి. అప్పుడే ఆ వంటకం నోరూరుతుంది. అయితే సూరత్‌లో ఓ ప్రత్యేకమైన వంటకం అక్కడి ప్రజలను నోరూరిస్తుంది. దీని తయారీలో బోలెడు శ్రమ ఉంటుంది. అయినప్పటికీ చివరగా వచ్చేది మాత్రం జొన్నలే. అయితే వీటి రుచి వర్ణించలేమంటున్నారు సూరత్ వాసులు... అసలు ఎలా తయారుచేస్తారో చూద్దామా...
పచ్చి జొన్న కంకులను కోతకు రాకముందే కోస్తారు. వీటిని ‘పోంక్’ అంటారు. వీటి నుంచి ఆకులను వేరు చేసి కేవలం కంకులు, పట్టుకోవడానికి కొంత భాగం ఉండేలా కత్తిరిస్తారు. ఆపై పెద్ద ఇనుప ప్లేట్‌లో బూడిద పోసి కింద మంట పెడతారు. ఈ కంకులపై వేడి వేడి బూడిద పోసి కప్పేస్తారు. రెండు వైపులా ఇలా రెండు నిమిషాల దాకా పెడతారు. ఇలా చేయడం వల్ల పచ్చి గింజలు కాస్తా ఉడికిపోతాయి. ఆ తర్వాత బూడిద, దుమ్ము అంతా పోయేలా దులిపేసి ఓ శుభ్రమైన పొడవైన సంచిలో జొన్న కంకులను వేసి, చాలాసేపటి వరకు కర్రతో ఆ కంకులను కొడుతూనే ఉంటారు. మొత్తం గింజలు వేరయ్యాక పెద్ద గిన్నెలో తీసుకుంటారు. మహిళలు వీటిని జల్లించి, ఆ తర్వాత చేటలో పోసి బాగా తూర్పారబట్టి ఇసుకరేణువులు, మిగతా దుమ్మును తీసేస్తారు. ఇలా తయారైన తాజా, ఆకుపచ్చని జొన్నలను అమ్ముతారు. వీటిని నేరుగా తినేయొచ్చు లేదా సేవ్‌తోనూ లాగించొచ్చు. సూరత్‌లోని ప్రతి దుకాణంలో వీటికోసం జనం బారులు తీరతారట. ఇది చలికాలంలో ప్రత్యేకంగా సూరత్‌లోనే దొరుకుతుంది.
ఈ పోంక్‌తో వడ, సమోసా కూడా తయారుచేస్తారు. ఈ దీంతో చేసిన స్నాక్స్‌ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలకూ సరఫరా చేస్తారు. దాదాపు చాలా ఏళ్ల నుంచి దీన్ని తయారుచేస్తున్నారట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్