ఒక గుడ్డు... 42 వంటకాలు

ఉదయం అల్పాహారంగా ఉడికించిన గుడ్డో, ఆమ్లెటో లేదా శాండ్‌విచో తింటుంటాం.... మహా అయితే గుడ్డుతో మరో నాలుగైదు రకాల వంటకాలు చేసుకుంటాం. అయితే ఇండోర్‌లోని మేఘ్‌దూత్‌ గార్డెన్‌ స్ట్రీట్‌లో

Updated : 20 Mar 2022 11:59 IST

ఉదయం అల్పాహారంగా ఉడికించిన గుడ్డో, ఆమ్లెటో లేదా శాండ్‌విచో తింటుంటాం.... మహా అయితే గుడ్డుతో మరో నాలుగైదు రకాల వంటకాలు చేసుకుంటాం. అయితే ఇండోర్‌లోని మేఘ్‌దూత్‌ గార్డెన్‌ స్ట్రీట్‌లో మొబైల్‌ ఫుడ్‌ స్టాల్‌ను నడిపే ఇజాజ్‌ మాత్రం ఏకంగా గుడ్డుతో 42 రకాల వంటకాలను నిమిషాల్లో తయారుచేసి అందిస్తారు. ‘జి3 రాయల్‌ ఆమ్లెట్‌’ పేరిట ఓ ఫుడ్‌ కోర్ట్‌ను నడుపుతున్నారాయన. ఇక్కడ ఎగ్‌ గొటాలా, ఆస్ట్రేలియన్‌ హాఫ్‌ ఫ్రై, బాయిల్డ్‌ ఎగ్‌ బుర్జీ, ఆమ్లెట్‌ రోల్‌ గ్రేవీ, చీజ్‌ ఆమ్లెట్‌, పిజా ఆమ్లెట్‌... రకాలు భోజనప్రియులకు చాలా ఇష్టమైనవి.  వీటి ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.30 నుంచి మొదలుకుని 130 రూపాయలోపు ఈ వెరైటీలు లభిస్తాయి. ఆరేళ్లుగా నడుపుతోన్న ఈ ఆహార బండికి రోజురోజుకు భోజనప్రియుల తాకిడి పెరుగుతోందట. దాంతో రకరకాల వెరైటీలను చేరుస్తున్నారట.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని