పోహా...జిలేబి

టిఫిన్‌ అంటే మనకి ఇడ్లీ, దోసె, పూరీ, వడనే గుర్తొస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వెళ్లి టిఫిన్‌ అడిగితే మీకు ఇవేమీ పెట్టరు. చక్కగా పోహా జిలేబీ వడ్డిస్తారు. పోహా అంటే అటుకులు. జిలేబీతో కలిపి కారప్పూస, ఉల్లిపాయలతో చేసిన మసాలా

Published : 29 May 2022 01:57 IST

టిఫిన్‌ అంటే మనకి ఇడ్లీ, దోసె, పూరీ, వడనే గుర్తొస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వెళ్లి టిఫిన్‌ అడిగితే మీకు ఇవేమీ పెట్టరు. చక్కగా పోహా జిలేబీ వడ్డిస్తారు. పోహా అంటే అటుకులు. జిలేబీతో కలిపి కారప్పూస, ఉల్లిపాయలతో చేసిన మసాలా అటుకులని వడ్డిస్తారు. ఇదేం కాంబినేషన్‌ అనుకోవద్దు. భోపాల్‌, ఇండోర్‌లని పోహా క్యాపిటల్‌ అని ఆహారప్రియులు ఇష్టంగా పిలుచుకుంటారు. అటుకులతో అన్ని రకాల వంటకాలు వండతారు అక్కడ. ఎన్ని రకాల టిఫిన్‌లు దొరికినా వాటన్నింటిలోనూ ఈ పోహా జిలేబీది ప్రత్యేక స్థానం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని