ఎండిన పండ్లతో...చాయ్!
చలి చక్కిలిగిలి పెడుతుంటే ఒంట్లో చురుకు పుట్టించడానికి ఓ కప్పు చాయ్ తాగితే బాగుండును అనిపిస్తుంది కదా! మీరూ చాయ్ ప్రేమికులు అయితే ఈసారి డ్రైఫ్రూట్ చాయ్‌ని ప్రయత్నించండి...
చలి చక్కిలిగిలి పెడుతుంటే ఒంట్లో చురుకు పుట్టించడానికి ఓ కప్పు చాయ్ తాగితే బాగుండును అనిపిస్తుంది కదా! మీరూ చాయ్ ప్రేమికులు అయితే ఈసారి డ్రైఫ్రూట్ చాయ్‌ని ప్రయత్నించండి...
డ్రైఫ్రూట్ చాయ్ అంటే బాదం, పిస్తా వంటివాటితో చేసినది కాదు. పండ్లని పోషకాలు కోల్పోకుండా ప్రత్యేకమైన పద్ధతిలో ఎండబెట్టి చేసిన స్లైసులతో చేసిన టీ ఇది. ఆన్లైన్లో ఈ చాయ్లని అమ్ముతున్నారు. ఈ కిట్‌లో ఏవైనా మూడు రకాల పండ్ల స్లైసులు దొరుకుతాయి. కివీ, ఆరెంజ్, డ్రాగన్‌ఫ్రూట్, బొప్పాయి, ఆపిల్, పియర్ వీటిల్లో ఏవైనా మీకు కావాల్సిన కాంబినేషన్‌ని ఎంచుకోవడమే. చూడ్డానికి ఎండినట్టుగా ఉన్నా వాటిల్లోని పోషకాలు మాత్రం భద్రంగానే ఉంటాయి. వేడినీటిలో వేసిన తర్వాత మృదువుగా మారతాయి. ఈ టీని తినొచ్చు కూడా. ఈ పండ్ల టీ వల్ల ఒత్తిడి తగ్గడం, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడమే కాదు.. యాంటిఆక్సిడెంట్లు అంది శరీరం చురుగ్గా ఉంటాయట. అంతేకాదు ఈ టీలో నిల్వకారకాలుకానీ, రసాయనాలుకానీ ఉపయోగించరు కాబట్టి మరీ ఆరోగ్యప్రదం అనుకుంటూ చాయ్ ప్రియులు ఈ డ్రైఫ్రూట్ టీలను ఇష్టంగా తాగుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్‌కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్