పోషకాలు చాట్ండి!
సాయంత్రం పూట అలా బయట కెళ్లినప్పుడు.. చాట్బండార్ని చూస్తే అప్రయత్నంగానే మన కాళ్లు బ్రేకులు వేసినట్టుగా ఆగిపోతాయి. ‘భయ్యా ఏక్ ఆలూ చాట్’ అనకుండా నోరు కట్టుకోవడం కష్టమే. చాట్ చేసే కిటుకు తెలిస్తే ఒక్క ఆలూచాట్ ఏంటి.. మటర్చాట్, కార్న్‌చాట్ ఇలా బోలెడు రకాల్ని అక్కడికంటే రుచిగా, శుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకే వీటిపై ఓ లుక్కేసేయండి..
చిలగడ దుంపతో...
కావాల్సినవి: చిలగడ దుంపలు- పావు కిలో, మిరియాల పొడి- పావు చెంచా, ఆమ్చూర్ పొడి- అర చెంచా, నిమ్మరసం- చెంచా, నల్ల ఉప్పు- తగినంత, జీలకర్రపొడి- పావుచెంచా
తయారీ: దుంపల్ని శుభ్రంగా కడిగి.. కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. మూతవచ్చాక దుంపల పొట్టు తీసేసి, కావాల్సిన సైజుల్లో ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వీటిపై నిమ్మరసం, మిరియాలపొడి, జీలకర్రపొడి, ఆమ్చూర్, ఉప్పు చల్లుకోవాలి. ఈ కాలంలో పోషకాలని అందించే చాట్ ఇది.
ఫ్రూట్ చాట్..
కావాల్సినవి: అరటిపండు- 1, యాపిల్- 1, పియర్- 1, కమలా-1, స్ట్రాబెర్రీలు- నాలుగు, మిరియాలపొడి- పావుచెంచా, చాట్ మసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, జీలకర్రపొడి- పావుచెంచా, పుదీనా ఆకులు- ఐదు, నిమ్మరసం- చెంచా
తయారీ: ముందుగా పండ్లని కావాల్సిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి. వీటికి మిరియాలపొడి, చాట్‌మసాలా, ఉప్పు, జీలకర్రపొడి, చిన్నగా తురుమిన పుదీనా ఆకులని చేర్చుకోవాలి. కలిపేటప్పుడు పండ్ల ముక్కలని మెత్తగా చేసేయొద్దు. ఆ తర్వాత నిమ్మరసం కలిపితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
బఠానీలతో...
కావాల్సినవి: బఠానీలు- కప్పు, నీళ్లు- కప్పున్నర, దాల్చినచెక్క- చిన్నముక్క, బిర్యానీ ఆకు- 1, అల్లంతురుము- చెంచా, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, కారం- చెంచా, గరంమసాలా- చెంచా, జీలకర్ర పొడి- అరచెంచా, ఆమ్చూర్- అరచెంచా, ఉల్లిపాయ ముక్కలు- మూడు చెంచాలు, టొమాటో ముక్కలు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి-2(సన్నగా తరిగి పెట్టుకోవాలి), కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, సన్నకారప్పూస- రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, చాట్‌మసాలా- చెంచా
తయారీ: బఠానీలు రాత్రే నానబెట్టుకోవాలి. కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకుని బఠానీలు, బిర్యానీ ఆకు, ఇంగువ, అల్లం తురుము వేసి సన్నమంటపైన నాలుగు విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తెరుచుకున్నాక పసుపు, కారం, గరంమసాలా, జీలకర్రపొడి, ఆమ్చూర్ వేసి బాగా కలిపి నీళ్లు ఇగిరేంతవరకూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని పైన నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర తురుము, కారప్పూస, చాట్‌మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే చాట్ సిద్ధం.
మొక్కజొన్న గింజలతో..
కావాల్సినవి: స్వీట్‌కార్న్- ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు- నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి-1, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, చాట్‌మసాలా- అరచెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, కారం- పావుచెంచా, నిమ్మరసం- చెంచా, ఉప్పు- పావు చెంచా, నూనె- చెంచా, సన్నకారప్పూస- నాలుగు చెంచాలు, దానిమ్మ గింజలు- రెండు చెంచాలు
తయారీ: స్వీట్‌కార్న్ గింజల్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. లేదా కడాయిలో కాసింత బటర్ వేసి మెత్తగా అయ్యేంతవరకూ వేయించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని వేడిగా ఉండగానే కారం, చాట్‌మసాలా, జీరాపొడి వేసి కలపాలి. చల్లారాక ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలపాలి. చివరిగా కారప్పూస, వేయించిన పల్లీలు, దానిమ్మ గింజలు చల్లుకొంటే చాట్ రెడీ.
కాశీ చాట్..
కావాల్సినవి: నూనె- చెంచా, ఉల్లిపాయ-1, ఆలుగడ్డలు- రెండు, టొమాటోలు- నాలుగు, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- ఒకటి, పావ్‌బాజీ మసాలా- రెండు చెంచాలు, గరంమసాలా- చెంచా, జీలకర్రపొడి- చెంచా, కారం- చెంచా, చాట్‌మసాలా- చెంచా, నల్ల ఉప్పు- అరచెంచా, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచా, నమక్పారా- అరకప్పు, సన్నకారప్పూస- అరకప్పు, కొత్తిమీర తురుము- పావుకప్పు
తయారీ: బంగాళాదుంపల్ని కుక్కర్లో ఉడికించుకుని నీళ్లు వార్చుకుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టి.. నూనెపోసి వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కల్ని దోరగా వేయించుకోవాలి. దీనిలో టొమాటో ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కూడా వేసి మెత్తగా మెదుపుకోవాలి. దీనిలో పావ్‌బాజీ మసాలా, గరంమసాలా, జీలకర్రపొడి, కారం, చాట్‌మసాలా, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక పాత్రలోకి తీసుకొని నిమ్మరసం వేసుకుని నమక్పారా, కారప్పూస, కొత్తిమీరతో అలంకరించుకోవాలి. పూరీ, టిక్కా, పావ్‌బాజీ బన్నుతో తింటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా : ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి
-
Movies News
Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!
-
Sports News
IND vs AUS: క్రీజ్‌లో పాతుకుపోయిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా స్కోరు 33/2 (15)
-
World News
Kim jong un: మళ్లీ కుమార్తెతో కనిపించిన కిమ్