కోరు.. పచ్చడి ఒకేసారి!

కొబ్బరి పచ్చడి లేకుండా ఇడ్లీలు, దోసెలు తినమంటే కష్టమే! మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసి చేసే పచ్చడి కన్నా... కోరు తీసి చేస్తే ఆ రుచి బాగుంటుంది

Published : 26 Mar 2023 00:52 IST

కొబ్బరి పచ్చడి లేకుండా ఇడ్లీలు, దోసెలు తినమంటే కష్టమే! మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసి చేసే పచ్చడి కన్నా... కోరు తీసి చేస్తే ఆ రుచి బాగుంటుంది. కానీ కోరు తీయడం అంటే పెద్ద పనే! ఈ పనులని ఒకేసారి చేసేస్తుందీ పరికరం. దీని పేరు మాక్సెల్‌ కోకోప్రో. ఈ ఎలక్ట్రిక్‌ పరికరంతో కోరుని సులభంగా తీసుకోవడంతోపాటు కాసింత జీలకర్ర, ఉప్పు, సెనగపప్పు వేసుకుంటే పచ్చడికూడా ఏకకాలంలో సిద్ధం అయిపోతుంది. అలాగే కోరం స్థానంలో జ్యూసర్‌ని ఉంచి పండ్ల రసాలు కూడా చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని