బోండాలు కరకరలాడేలా రావాలంటే?

నాకు బయటదొరికే మైసూర్‌ బోండాలంటే ఇష్టం. ఇంట్లో చేస్తుంటే గట్టిగా వస్తున్నాయి. ఇవి గుల్లగా, రుచిగా రావడానికి ఏదైనా చిట్కా ఉంటుందా?

Published : 30 Apr 2023 00:49 IST

నాకు బయటదొరికే మైసూర్‌ బోండాలంటే ఇష్టం. ఇంట్లో చేస్తుంటే గట్టిగా వస్తున్నాయి. ఇవి గుల్లగా, రుచిగా రావడానికి ఏదైనా చిట్కా ఉంటుందా?

సాధారణంగా బోండాలని మైదాతో చేస్తారు. అందుకే చాలామంది దూరం పెడుతుంటారు. కొంతమంది పైన కరకరలాడే భాగాన్ని తినేసి మధ్యలో తెల్లని దాన్ని వదిలేస్తారు. అలా కాకుండా మొత్తం తినేలా ఉండాలంటే మినప్పప్పుతో చేసుకోవచ్చు. ఒక కప్పు మినపప్పుకి పావుకప్పు మైదా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంముక్కలు, మిరియాలు, కొబ్బరి తురుము చేర్చుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి. అయితే వీటికోసం మరీ పాత మినపప్పుని నానబెట్టుకోవద్దు. ఇది పిండి కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా బోండాలు సాఫ్ట్‌గా కూడా రావు. అలాగే పిండి పలుచగా, మరీ మందంగా కాకుండా రుబ్బుకోవాలి. పిండి పలుచగా ఉంటే బోండాలు ఎక్కువగా నూనె పీల్చుకుంటాయి. కరకరలాడేలా రావాలి అంటే కొద్దిగా బియ్యప్పిండి లేదా బొంబాయి రవ్వని వేసుకోవచ్చు. బోండా మిశ్రమంలో పెరుగు లేదా నిమ్మకాయ రసం కలిపాక కనీసం గంటసేపయినా పిండిని నాననివ్వాలి. అప్పుడే బోండాలు మృదువుగా ఉంటాయి. కప్పు మినపప్పు నానబెట్టుకుంటే కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, పావుకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా జోడించవచ్చు. నూనె కాగకుండా వేస్తే బోండాలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి.

పవన్‌ సిరిగిరి, హైదరాబాద్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని