ఎప్పుడూ అవే పాప్‌కార్నా!!

సినిమాహాల్, ఎగ్జిబిషన్‌ లాంటి స్థలాల్లో పాప్‌కార్న్‌ లేకపోతే మహా వెలితిగా ఉంటుంది.

Published : 30 Jun 2024 00:39 IST

సినిమాహాల్, ఎగ్జిబిషన్‌ లాంటి స్థలాల్లో పాప్‌కార్న్‌ లేకపోతే మహా వెలితిగా ఉంటుంది. ఈ పసందైన పాప్‌కార్న్‌లో మసాలా, సాల్టెడ్, ప్లెయిన్‌ అంటూ రెండు మూడు రకాలే మనకు తెలుసు. నిజానికి తీపి, ఘాటు వంటి అనేక రుచులున్నాయి. 

  • పాప్‌కార్న్‌కు తియ్యతియ్యటి క్యారమెల్‌ కోటింగ్‌ ఇచ్చి, సముద్ర ఉప్పు వేసినప్పుడు చిత్రమైన రుచీ, వాసనలతో వారెవా అనిపిస్తుంది.
  • గ్రీన్‌టీ ఆకులతో తయారయ్యే మాచా, ఉప్పులను పాప్‌కార్న్‌కు జతచేసినప్పుడు చిత్రమైన పరిమళంతో ఆకట్టుకుంటుంది.
  • చిల్లీసాస్‌ చేర్చిన పాప్‌కార్న్‌ ఘాటైన రుచులను ఇష్టపడేవారికి కారం కారంగా నాలుక్కి కమ్మగా తగుల్తుంది.
  • చీజ్‌ జతచేసిన పాప్‌కార్న్‌ అద్భుతమైన రుచితో అలరిస్తుంది.
  • ఎండు క్యాప్సికమ్‌తో చేసిన పప్రికా పౌడర్, వెల్లుల్లి పొడి, డ్రై జింజర్‌ పౌడర్, మిరియాల పొడి మొదలైనవి చేర్చిన పాప్‌కార్న్‌ తందూరి చికెన్‌ వాసనతో నాన్‌వెజ్‌ ప్రియులకు బాగా నచ్చుతుంది.
  • టొమాటో, చిల్లీసాస్‌లు కలగలసిన పాప్‌కార్న్‌ కొంచెం కారం, కొద్దిగా పుల్లదనంతో నోరూరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని