చకచకా చేసేయొచ్చు..!

బరువు తగ్గడానికో.. మధుమేహం వల్లో లేదా ఇతర కారణాల మూలంగానో చపాతీలు తినేవాళ్లు ఎందరో ఉంటారు.

Published : 07 Jul 2024 00:40 IST

రువు తగ్గడానికో.. మధుమేహం వల్లో లేదా ఇతర కారణాల మూలంగానో చపాతీలు తినేవాళ్లు ఎందరో ఉంటారు. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి కానీ పిండి కలపాలంటేనే కాస్త విసుగ్గా ఉంటుంది. ఆ పనిని సులువు చేసేందుకు వచ్చిందే ‘సిలికాన్‌ నీడింగ్‌ అండ్‌ రోలింగ్‌ మ్యాట్‌‘. గిన్నెలో పిండి కలుపుతుంటే, రొట్టెల పీట మీద చపాతీ చేస్తున్నప్పుడూ చేతులతోపాటు, పీటకూ పిండి అతుక్కుపోతుంటుంది. కానీ ఈ సిలికాన్‌ మ్యాట్‌ మీ దగ్గర ఉంటే ఇక అలాంటి సమస్యే ఉండదు. పిండి కలపడం, రొట్టె చేయడం కూడా చకచకా అయిపోతాయి. చాలా సౌలభ్యంగా ఉండే ఈ మ్యాట్‌ నచ్చితే మీరూ ఒకటి కొనుక్కోండి. పైగా దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా తేలిక.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని