ఎర్రని పండు... లాభాలు మెండు!
ఎర్రగా మెరుస్తూ... తియ్యతియ్యగా ఉండే దానిమ్మ పండు గింజలు రుచిని పంచడంలోనే కాదు పోషకాలనూ అందిస్తాయి. మరి ఈ పండు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
* దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి ఖనిజాలతోపాటు పీచూ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.
* ఈ పండులోని విటమిన్ కె రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి సాయపడుతుంది.
* దీంట్లో ఇనుము ఎక్కువ. కాబట్టి తరచూ తీసుకుంటే రక్తహీనత సమస్య ఉత్పన్నం కాదు.
* విటమిన్-సి మెండుగా ఉండటం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది.
* అనార్గా పిలిచే ఈ పండు దంత సమస్యలకు చెక్ పెడుతుంది. చిగుళ్లవాపును తగ్గిస్తుంది.
* దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొల్లాజెన్, ప్యూనిక్ యాసిడ్ ఉంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.
* అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు.. లాంటి ఉదర సంబంధ సమస్యలను ఇది తగ్గిస్తుంది.
* ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
* ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముక సాంద్రత కూడా అధికమవుతుంది.
* రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* శరీరంలో అంతర్గత అవయవాల్లోని వాపులను తగ్గిస్తుంది.
* జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.
* చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* ఆర్థ్రరైటిస్ సమస్యలను ఈ పండు అడ్డుకుంటుంది.
* ఏడాదంతా లభించే ఈ ఎర్రటి పండును రోజూవారి ఆహారంలో చేర్చుకుంటే చాలారకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు.
* ఈ పండును జ్యూస్‌గా కంటే నేరుగా గింజల రూపంలో తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
Sports News
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
-
Movies News
RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
-
Politics News
BJP: ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్ రాయిచుర
-
General News
Gastritis: వానాకాలంలో వచ్చే ముప్పు ఏంటో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?