రోగనిరోధకతకు వరం...

యాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో దాదాపుగా 7500 రకాలున్నాయట. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...

Published : 13 Feb 2022 01:38 IST

యాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో దాదాపుగా 7500 రకాలున్నాయట. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...

యాపిల్‌లో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పీచు ఉంటాయి. కొవ్వులు, సోడియం అస్సలుండవు. పొటాషియం, నియాసిన్‌, ఫోలేట్స్‌, థయామిన్‌ ఖనిజాలతోపాటు విటమిన్లు ఎ, సి, ఇ, కె ఉంటాయి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి.   సహజ చక్కెరలు (గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌) తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఆకలిగా అనిపించినప్పుడు ఓ యాపిల్‌ తింటే సరి.
ఎర్రటి పండులో ఇనుము ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచి రక్తహీనత రానీయదు. ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించడంతోపాటు శరీరంలోని అవయవాలకు ప్రాణవాయువు సరిగ్గా అందేలా చూస్తుంది. ఈ పండులో రోగనిరోధకతను పెంచే విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. అలాగే ప్రొటీన్లు కూడా. ఇవి ఇమ్యూనిటీని పెంచి శరీరం రోగాల బారిన పడకుండా కాపాడతాయి.
దీంట్లో పీచు ఎక్కువని తెలుసు కదా. దీన్ని రోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాదు శరీరరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలూ తగ్గు ముఖం పడతాయి. విటమిన్‌- ఎ కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు దీన్ని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని