డ్రాగన్‌ ఫ్రూట్‌... పోషకాల ఖజానా!

గులాబీ రంగులో అరచేతిలో పట్టేంత ఈ పండు ఆకర్షణీయంగానే కాదు రుచిగానూ ఉంటుంది.  దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

Published : 20 Feb 2022 00:09 IST

గులాబీ రంగులో అరచేతిలో పట్టేంత ఈ పండు ఆకర్షణీయంగానే కాదు రుచిగానూ ఉంటుంది.  దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

పండు పైన గులాబీ రంగులో.. లోన తెల్లని గుజ్జుతో.. నల్లని చిన్న విత్తనాలతో ఉంటుంది. ఈ పండులో మూడు రకాలుంటాయి. కప్పు గుజ్జు నుంచి దాదాపు 136 కెలొరీలు అందుతాయి. పిండిపదార్థాలు- 29 శాతం, పీచు- 7 గ్రా., మాంసకృత్తులు- 3 గ్రా., ఇనుము- 8 శాతం ఉంటాయి. కొవ్వులు అస్సలుండవు. జింక్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ ఖనిజాలు మెండుగా ఉంటాయి. పోషకాలు పుష్కలం. దీని నుంచి అందే కెలొరీలు అత్యల్పం.  మిగతా పండ్ల మాదిరే దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.

ఈ పండు ఇన్సులిన్‌ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది. దీనిలోని రసాయనాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు దీని గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. సమృద్ధిగా ఉండే పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువునూ నియంత్రిస్తుంది. ఈ పండులోని పిటయా అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది. విటమిన్‌-సి, కెరొటినాయిడ్‌లు ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడతాయి. ఈ పండులోని మెత్తటి భాగాన్ని ముక్కలుగా చేసుకుని తినొచ్చు. దీని గుజ్జుతో స్మూథీలు చేసుకోవచ్చు. సలాడ్‌లా, పెరుగులోనూ వేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని