ద్రాక్ష... ఆరోగ్య రక్ష!

తియ్యనైన ద్రాక్షలో.. విటమిన్లు, మినరళ్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆకుపచ్చ, ఊదా, ఎరుపు రంగుల్లో ఈ పండ్లు లభ్యమవుతాయి. వీటివల్ల ప్రయోజనాలేంటో చూడండి..

Published : 06 Mar 2022 01:15 IST

తియ్యనైన ద్రాక్షలో.. విటమిన్లు, మినరళ్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆకుపచ్చ, ఊదా, ఎరుపు రంగుల్లో ఈ పండ్లు లభ్యమవుతాయి. వీటివల్ల ప్రయోజనాలేంటో చూడండి..

* అలసట, ఆకలిగా అనిపించినప్పుడు గుప్పెడు ద్రాక్షపండ్లు తినండి. ఆకలి తీరడంతోపాటు తక్షణ శక్తీ లభిస్తుంది.
* కప్పు పండ్ల నుంచి 62 కెలొరీల శక్తి లభిస్తుంది. పిండిపదార్థాలు-16 గ్రా.,  మాంసకృత్తులు-0.6 గ్రా., కొవ్వులు-0.3 గ్రా., ఉంటాయి.  
* ఈ పండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే రోగనిరోధక  శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు.
* వీటిలోని పొటాషియం నిల్వలు రక్తపోటు పెరగకుండా నియంత్రిస్తాయి.
* పీచు కూడా ఎక్కువే. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.  
* ఈ పండ్లలోని విటమిన్‌-కెతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి.  
* గుండె జబ్బులు, కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఇవి అడ్డుకుంటాయి.
* పండ్లను జ్యూస్‌లా కాకుండా నేరుగా తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు వీటిని ఇలాగే అలవాటు చేయాలి.
* నల్ల ద్రాక్షలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీతోపాటు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుని చర్మానికి మెరుపునిస్తాయి.
ఎండిన ద్రాక్షనే రెసిన్స్‌/కిస్‌మిస్‌ అని పిలుస్తారు. వీటిలోనూ పోషకాలు బోలెడు. చిన్నా, పెద్దా అందరూ తీసుకోవచ్చు. మధుమేహులు వైద్యుల సూచనల మేరకు మాత్రమే తినాలి.
చిన్నారులకు చాక్లెట్‌, స్వీట్లకు ప్రత్యామ్నాయంగా వీటిని ఇస్తే ఇష్టంగా తింటారు.  


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు