చల్ల చల్లని మాక్‌టైల్‌

ఎండకాలంలో కొన్నింటిని చల్లచల్లగా తీసుకుంటే ఆ మజానే వేరు. అలాంటిదే ఈ ‘మై తై మాక్‌టైల్‌’. దీంట్లోని చల్లదనంతోపాటు పోషకాల రుచులను చవి చూసేయండి మరి.

Updated : 17 Apr 2022 05:19 IST

ఎండకాలంలో కొన్నింటిని చల్లచల్లగా తీసుకుంటే ఆ మజానే వేరు. అలాంటిదే ఈ ‘మై తై మాక్‌టైల్‌’. దీంట్లోని చల్లదనంతోపాటు పోషకాల రుచులను చవి చూసేయండి మరి.

కావాల్సినవి: కమలాపండు, పైనాపిల్‌ రసం- లీటరు చొప్పున; నిమ్మరసం, బాదం సిరప్‌- అరకప్పు చొప్పున, సోడా నీళ్లు- లీటరు, ఐసు ముక్కలు- కొన్ని, గ్రెనడైన్‌ సిరప్‌ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది)- అరచెంచా, కమలా, నిమ్మ పండు ముక్కలు, చెర్రీలు- కొన్ని (అలంకరణకు).

తయారీ: గాజుపాత్రలో కమలా, పైనాపిల్‌ రసాలు, బాదం సిరప్‌ వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తర్వాత గాజు గ్లాసులో ఐసు ముక్కలు వేసి అర కప్పు జ్యూస్‌,  సోడా నీళ్లు పోయాలి. గ్రెనడైన్‌ సిరప్‌నూ కలపాలి. కమలా, నిమ్మ చక్రాలు, చెర్రీలతో అలంకరిస్తే సరి. చల్లటి రుచికరమైన వేసవి పానీయం మై టై మాక్‌టైల్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని