మట్టి పిడతల్లో... తాజా ద్రాక్షలు!

మండే వేసవిలోనే మధురమైన మామిడి పండ్లు దొరుకుతాయి. వాటిని వర్షాకాలంలో తినాలంటే వేరే రూపంలో తినాల్సిందే తప్ప యథాతథంగా తినలేం. సీజన్‌పరంగా దొరికే పండ్లని అదే తాజాదనంతో మరో రుతువులో తినాలనుకోవడం కష్టమే

Updated : 05 Jun 2022 05:38 IST

మండే వేసవిలోనే మధురమైన మామిడి పండ్లు దొరుకుతాయి. వాటిని వర్షాకాలంలో తినాలంటే వేరే రూపంలో తినాల్సిందే తప్ప యథాతథంగా తినలేం. సీజన్‌పరంగా దొరికే పండ్లని అదే తాజాదనంతో మరో రుతువులో తినాలనుకోవడం కష్టమే. కానీ అఫ్ఝన్లకి ఈ సౌలభ్యం ఉంది. అవును వాళ్లు వేసవిలో మాత్రమే దొరికే ద్రాక్షపండ్లని గడ్డు శీతాకాలంలో కూడా తాజాగా తింటూ ఆనందిస్తారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కంగీనా అనే ప్రాచీన ఆహార నిల్వ పద్ధతి ద్వారా ద్రాక్ష వంటి కొన్ని రకాల పండ్లని నిల్వ చేయగలుగుతారు. మట్టిపిడతలని తీసుకుని వాటిల్లో పండ్లని ఉంచి మట్టితోనే మూసేస్తారు. అలా నిల్వ చేసిన మట్టి పిడతలని సెల్లార్లలోకానీ, చల్లగా ఉండే గదుల్లో కానీ ఉంచుతారు. గడ్డికూడా మొలవని శీతాకాలంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఈ కంగీనా పిడతలని విక్రయిస్తారు. ఎండు ద్రాక్షల ఉత్పత్తిలోనూ అఫ్ఝన్లది పైచేయే అయినా.. ఈ తాజా ద్రాక్షని తినడానికి అక్కడి వాళ్లు ఎంతో ఆసక్తి చూపిస్తారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని