మనల్ని ఫిదా చేసిన పాకిస్తానీ రుచి!

రూఅఫ్జా.. ఏ కిరాణా కొట్టుకెళ్లినా, ఏ సీజన్‌లో అయినా తేలిగ్గా దొరికే ఈ ఎర్రరంగు పానీయం గురించి తెలియని వాళ్లు ఉండరేమో! ఉత్తరాది వాళ్లకయితే ఇంట్లో ఏ వేడుక జరిగినా రూఅఫ్జా ఉండి తీరాల్సిందే. దిల్లీ వెళ్తే అందరూ తాగే మొహబ్బత్‌కి షర్బత్‌ని దీంతోనే

Published : 26 Jun 2022 00:45 IST

113 ఏళ్ల చరిత్ర...

రూఅఫ్జా.. ఏ కిరాణా కొట్టుకెళ్లినా, ఏ సీజన్‌లో అయినా తేలిగ్గా దొరికే ఈ ఎర్రరంగు పానీయం గురించి తెలియని వాళ్లు ఉండరేమో! ఉత్తరాది వాళ్లకయితే ఇంట్లో ఏ వేడుక జరిగినా రూఅఫ్జా ఉండి తీరాల్సిందే. దిల్లీ వెళ్తే అందరూ తాగే మొహబ్బత్‌కి షర్బత్‌ని దీంతోనే తయారుచేస్తారు. 113 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పానీయం గురించి మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఇది భారతీయ పానీయం కాదు. పాకిస్తానీ ఔషధం. పాకిస్తాన్‌కి చెందిన యునాని వైద్యుడు హకీమ్‌అబ్దుల్‌ మాజిద్‌ మొదట దీనిని వడదెబ్బ నుంచి రక్షించి.. వ్యాధినిరోధక శక్తిని పెంచే టానిక్‌గా తయారుచేశాడు. అప్పటికి దేశ విభజన జరగక పోవడంతో... పాకిస్తాన్‌లో కన్నా దీన్ని దిల్లీ, అప్ఘనిస్తాన్‌లలో ఎక్కువ వాడేవారు. దాంతో మాజిద్‌ దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. ప్రత్యేకమైన లోగో చేయించారు. వందేళ్ల క్రితం రూపొందించిన ఆ లోగోనే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో పుదీనా, ద్రాక్ష, క్యారెట్, పుచ్చకాయ, గసగసాలు, కొత్తిమీర, పాలకూర, లిల్లీపూలు, కలువలు ప్రధానంగా ఉంటాయి. అయితే దేశ విభజన తర్వాత కొన్నాళ్లపాటు ఈ రూఅఫ్జా దొరకలేదు. కారణం విభజన సమయంలో చెట్టుకొకరు పుట్టకొకరైన కుటుంబాల్లో మాజిద్‌ కుటుంబం కూడా ఉంది. తర్వాత కొన్నాళ్లకు అతని కుమారుడు బంగ్లాదేశ్‌ చేరుకుని అక్కడ నుంచి ఈ పానీయాన్ని తయారుచేయడం మొదలుపెట్టాడు. అలా మనదేశంతోపాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ ఇంకా మరికొన్ని యూరోప్‌ దేశాల్లో కూడా ఈ పానీయానికి అభిమానులున్నారు. రూ.600 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ రూఅఫ్జా టెట్రా ప్యాకింగ్‌లోనూ రానుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని