పోషకాల నేరేడు...

 నేరేడు పండ్లు పుష్కలంగా దొరికే కాలం ఇది. రుచిలోనే కాదు... పోషకాల్లోనూ అద్భుతమే. దీని సుగుణాల గురించి తెలుసుకుంటే ఎప్పుడు కనిపించినా వదలకుండా తినేస్తారు...

Updated : 10 Jul 2022 11:04 IST

నేరేడు పండ్లు పుష్కలంగా దొరికే కాలం ఇది. రుచిలోనే కాదు... పోషకాల్లోనూ అద్భుతమే. దీని సుగుణాల గురించి తెలుసుకుంటే ఎప్పుడు కనిపించినా వదలకుండా తినేస్తారు...

* రక్తహీనత ఉన్నవాళ్లు తింటే ఈ పండు ఆ లోపాన్ని పూరించి హెమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ సరఫరాని పెంచి శరీరం చురుగ్గా ఉండేట్టు చేస్తుంది.
* మొటిమలు, యాక్నె, ముఖంపై ముడతలు ఉండేవారు ఈ పండుని తింటే ఆ సమస్యలు పోయి చర్మం నిగారింపుతో మెరిసిపోతుంది.
* గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం ఈ పండ్లలో నిండుగా ఉంటుంది.
* పీచు ఎక్కువగా ఉండి... కెలొరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకొనేవారికి మంచి ఆహారం.
* అజీర్తి నుంచి ఉపశమనం కలిగించి మలబద్ధకం సమస్యలు రాకుండా చూస్తుంది.
* నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిలువరించి దంత సమస్యలు రాకుండా నేరేడు కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని