Updated : 10 Jul 2022 07:28 IST

ఆలూపాల గురించి విన్నారా?

బాదంపాలు విన్నాం... కొబ్బరిపాలు, సోయాపాల గురించీ తెలుసు. మరి ఆలూపాల ఏంటి అంటారా? భవిష్యత్తులో మామూలు పాల మాదిరిగానే ఈ పొటాటోమిల్క్‌ ట్రెండు కానున్నాయట. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం..

సాధారణ డెయిరీ పాలకు బదులుగా శాకాహారం నుంచి తయారుచేస్తున్న పాలకు ఈ మధ్యకాలంలో డిమాండ్‌ పెరుగుతోంది. మొత్తం పాలల్లో ఈ తరహా ప్లాంట్‌ బేస్డ్‌ పాల వాటా ఇప్పటికే 10శాతం ఉంది. ఇలా గింజలు, దుంపల నుంచి తీసిన పాలకు డిమాండ్‌ పెరగడానికి కారణం... గ్లోబల్‌ వార్మింగ్‌ని అదుపు చేయడానికే. అదేంటి పాలకు.. భూతాపానికి సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? పశువుల నుంచి పాలను ఉత్పత్తి చేయాలంటే అందుకు తగ్గట్టుగా నీళ్లను ఖర్చుచేయాలి. పశువులు మిథేన్‌ వాయువుని విడుదల చేస్తాయి. అది భూతాపానికి కారణం అవుతుంది. ఇవన్నీ లేకుండా డెయిరీ పాలకు, ప్రొటీన్‌కి సరైన ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వస్తున్న పాలే... సోయామిల్క్‌, బాదంమిల్క్‌ ఇప్పుడీ ఆలూమిల్క్‌. తక్కినవాటితో పోలిస్తే ఈ పాలు ఆరోగ్యదాయకంగా ఉండటం, ఎక్కువ ఉత్పత్తి చేయడానికి వీలుగా ఉండటంతో విదేశాల్లో ఇప్పటికే వీటికి ఆదరణ పెరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts