ఇక నుంచి నీలి రంగులో...

శీతల పానీయాలు, ఐస్‌క్రీంలు, చిరుతిళ్లు.. ఇలాంటివన్నీ గులాబీ, నారింజతో సహా అనేక రంగుల్లో చూసుంటారు.

Published : 29 Jan 2023 00:05 IST

శీతల పానీయాలు, ఐస్‌క్రీంలు, చిరుతిళ్లు.. ఇలాంటివన్నీ గులాబీ, నారింజతో సహా అనేక రంగుల్లో చూసుంటారు. కానీ నీలం రంగులో ఉన్నవి ఎప్పుడైనా చూశారా? పెద్దగా కనిపించవు. కనిపించినా అవి కృత్రిమ రంగులే తప్ప సహజ పదార్థాల నుంచి తీసినవి కావు. ఇక నుంచి ఆ కొరత తీరుస్తోంది. గావన్‌ అనే అంతర్జాతీయ సంస్థ..

అందమైన నీలిరంగు చూడ్డానికి ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ పదార్థాలకు ఈ రంగుని అద్దడం అంత తేలిక్కాదట. కృత్రిమ పద్ధతుల్లో కాకుండా సహజపదార్థాల నుంచి ఈ రంగుని తీసి ఐస్‌క్రీంలు, పానీయాలకు అద్దడం ఇంతవరకూ చాలా క్లిష్టమైన ప్రక్రియగానే ఉండేది. కారణం... శీతలపానీయాల్లోని రసాయనాలు ఈ రంగుని ప్రభావితం చేసి వర్ణవిహీనం చేస్తుంటాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లోని ఖనిజాలు ఈ రంగుని నిలవనిచ్చేవి కావు. కానీ సముద్ర నాచు, ఇతర చెట్ల నుంచి తీసిన నీలిరంగుతో గవన్‌ సంస్థ పరిశోధనలు చేసింది. స్పైరులినాతో చేసిన ప్రయోగం విజయవంతమై.. ఈ నీలిరంగుని నిల్వ చేయడం సాధ్యమవుతోంది. అంటే ఇక నుంచి డ్రింకులు, చిరుతిళ్లు, ఐస్‌క్రీంల్లాంటివి మనకి అందమైన నీలిరంగులో దొరుకుతాయన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు