సుగుణాల సిరి చవులూరించే కొబ్బరి
ఎండ తాపం పెరుగుతుంటే మనసు చల్లగా ఏదైనా కోరుకుంటుంది. చల్లదనంతోపాటు పోషకాలనీ అందించే కొబ్బరి పానీయాలివి.
ఎండ తాపం పెరుగుతుంటే మనసు చల్లగా ఏదైనా కోరుకుంటుంది. చల్లదనంతోపాటు పోషకాలనీ అందించే కొబ్బరి పానీయాలివి.
నిమ్మకాయతో..
కావాల్సినవి: కొబ్బరినీళ్లు- గ్లాసు, పుదీనా ఆకులు- కొద్దిగా, తేనె- చెంచా, నిమ్మకాయ- ఒకటి.
తయారీ: కొబ్బరి నీళ్లను ఒక మగ్గులోకి తీసుకోవాలి. దాంట్లో లేత కొబ్బరి ఉంటే అది కూడా సన్నగా తరిగి తీసుకోవచ్చు. పుదీనా ఆకుల్ని సన్నగా తరిగి, తేనె, చెక్క నిమ్మరసాన్ని పూర్తిగా తీసి కొబ్బరినీళ్లలో కలపాలి. చల్లగా సర్వ్ చేసుకుంటే ఎండ నుంచి ఉపశమనంతోపాటు ఆరోగ్యం కూడాను.
బీచ్ బ్లాండీ
కావాల్సినవి: స్ట్రాబెర్రీ ముక్కలు- కప్పు, కొబ్బరి నీళ్లు- కప్పు, వెనిలా ఎసెన్స్- రెండు చుక్కలు, పైనాపిల్ ముక్కలు- అరకప్పు, అరటిపండు ముక్కలు- అరకప్పు, ఐస్‌ముక్కలు- 8
తయారీ: కొబ్బరినీళ్లు, పండ్ల ముక్కలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరిగా వెనిలా ఎసెన్స్, ఐస్‌ముక్కలు వేసుకుంటే బీచ్ బ్లాండీ సిద్ధం.
బొప్పాయితో..
కావాల్సినవి: కొబ్బరినీళ్లు- అరకప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, పైనాపిల్ ముక్కలు- కప్పు, బొప్పాయి ముక్కలు- కప్పు, ఫ్రోజెన్ అరటిపండు- ఒకటి, ఐస్‌ముక్కలు- 8.
తయారీ: కొబ్బరినీళ్లు, బొప్పాయి, పైనాపిల్, అరటిపండు ముక్కలు, నిమ్మరసం వీటిని బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. అంతే కొబ్బరి, బొప్పాయి స్మూతీ రెడీ. చివర్లో ఐస్ ముక్కల్ని వేసుకొని చల్లచల్లగా అందివ్వడమే.
క్యారెట్‌తో..
కావాల్సినవి: క్యారెట్లు పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్నవి- మూడు, ఆపిల్ చెక్కు తీసి తరిగిపెట్టుకున్నది- ఒకటి, నిమ్మకాయ- ఒకటి, అల్లం- చిన్నముక్క పొట్టు తీసుకొని సన్నగా తరగాలి, పుదీనా ఆకులు- గుప్పెడు, కొబ్బరినీళ్లు- కప్పు, ఐస్‌ముక్కలు-8.
తయారీ: క్యారెట్, ఆపిల్, అల్లం, పుదీనా, కొబ్బరినీళ్లను బ్లెండర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో నిమ్మరసం, ఐస్‌ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.
మామిడిపండుతో..
కావాల్సినవి: మామిడిపండు ముక్కలు చల్లనివి- రెండు కప్పులు, నిమ్మరసం- మూడు చెంచాలు, కొబ్బరి నీళ్లు- రెండు కప్పులు, పుదీనా ఆకులు- కొద్దిగా, మిరియాలపొడి- చిటికెడు, ఐస్ ముక్కలు- 8
తయారీ: కొబ్బరినీళ్లు, మామిడిపండు ముక్కలు, నిమ్మరసం, పుదీనా, మిరియాలపొడి వీటిని బ్లెండర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు ఐస్‌ముక్కలు వేసి చేస్తే అమోఘమైన రుచితోపాటు ఆరోగ్యం కూడా.
కమలాతో..
కావాల్సినవి: కమలారసం- కప్పు, సోడా- కప్పు, కొబ్బరి నీళ్లు- కప్పు, పుదీనా- కొద్దిగా, ఐస్ ముక్కలు- తగినన్ని..
తయారీ: ఒక మగ్గులో కమలారసం, సోడా, కొబ్బరి నీళ్లు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి కలపాలి. చివర్లో సరిపడా ఐస్ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సోడాకి బదులుగా స్పార్క్లింగ్ వాటర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..