నిమ్మగడ్డితో అజీర్తి దూరం!

టీ, కాఫీల స్థానంలో ఏదైనా మేలు చేసే పానీయం తాగాలనుకుంటున్నారా? అయితే నిమ్మగడ్డిని మించిన ప్రత్యామ్నాయం లేదు.

Published : 02 Apr 2023 00:16 IST

టీ, కాఫీల స్థానంలో ఏదైనా మేలు చేసే పానీయం తాగాలనుకుంటున్నారా? అయితే నిమ్మగడ్డిని మించిన ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే దీనితో చేసిన టీ.. వేసవిలో చక్కని ఉపశమనం ఇవ్వడంతోపాటు అనేక ప్రయోజనాలనీ అందిస్తుంది..

* నిమ్మగడ్డిని నీళ్లలో వేసి మరిగించి ఆ టీ తీసుకుంటే.. అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్‌, అల్సర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలోని సున్నితమైన పొరల్ని రక్షిస్తుంది.

* వేసవిలో చెమట రూపంలో శరీరం కోల్పోయిన పోషకాలని ఈ టీ తిరిగి అందించి వికారం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులను పెరగకుండా చూస్తుంది.

నిమ్మగడ్డిని మరిగించి ఆ నీటిని తలస్నానానికి వాడితే చుండ్రు అదుపులో ఉంటుంది.

* అయితే గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు ఈ నిమ్మగడ్డిని తీసుకోకపోవడమే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని