బరువు తగ్గించే మామిడి.. తిందామా!

వేసవికాలం అనగానే గుర్తొచ్చేవి.. మామిడిపండ్లే. అసలివి ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. 4 వేల సంవత్సరాలకు పైబడి మామిడిని సాగు చేస్తున్నారు.

Updated : 09 Apr 2023 13:05 IST

వేసవికాలం అనగానే గుర్తొచ్చేవి.. మామిడిపండ్లే. అసలివి ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. 4 వేల సంవత్సరాలకు పైబడి మామిడిని సాగు చేస్తున్నారు. వీటిల్లో వందల రకాలుంటాయి. బంగినపల్లి, రసాలు, తోతాపురి ఇలా ఒకదానికి మించి మరొకటి ఎంతో రుచిగా ఉంటాయి. రుచే కాదు పోషకాలూ ఎక్కువే! తెలుసుకోవాలా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి..

* మామిడి పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌, పెక్టిన్‌  వంటివి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి.

*  ఒక పండు తినగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. అలా బరువు తగ్గించడంలోనూ మామిడి సాయపడుతుంది.

*  విటమిన్‌ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది. ఈ పండులో ఐరన్‌ శాతం కూడా ఎక్కువే.

*  మామిడి పండ్లే కాదండోయ్‌! మామిడాకులు కూడా మనకు మేలు చేస్తాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు అయిదు ఆకులను నీళ్లలో ఉడకబెట్టి వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. చూశారా మనం ఎంతగానో ఇష్టపడి తినే మామిడిపండు వల్ల ఎన్ని లాభాలున్నాయో.. మీరూ తినేయండి మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని