మండే ఎండల్లో చల్లచల్లటి జిగర్ తండా
జిగర్ తండా పేరు ఎప్పుడైనా విన్నారా! ఇది తమిళనాడు మధురైలో దొరికే చల్లచల్లటి పానీయం. వేసవిలో ఎండను తట్టుకోవాలంటే ఇది తప్పకుండా తాగాల్సిందేనంటారు అక్కడి ప్రజలు.
జిగర్ తండా పేరు ఎప్పుడైనా విన్నారా! ఇది తమిళనాడు మధురైలో దొరికే చల్లచల్లటి పానీయం. వేసవిలో ఎండను తట్టుకోవాలంటే ఇది తప్పకుండా తాగాల్సిందేనంటారు అక్కడి ప్రజలు. జిగర్ అంటే గుండె, తండా అంటే చల్లదనం.. ఈ చల్లటి పానీయం ఎంతో రుచిగానూ ఉంటుంది తెలుసా! పైగా దీంట్లో ఉన్న పోషకాలు అనారోగ్య సమస్యలను దరిచేరనీయవు కూడా. జిగర్ తండాలో వాడే ఆల్మండ్ గమ్ శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తక్షణ శక్తినిస్తుంది. కడుపులో అజీర్తి వల్ల వచ్చే మంట కూడా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి భయాలూ లేకుండా పిల్లలకూ ఇవ్వొచ్చంటారు. వేసవిలో మధురైలో ప్రతి వీధిలో తోపుడు బండ్లపై జిగర్ తండా దొరుకుతుంది. అదక్కడ అంత ఫేమస్ మరి.
కావల్సిన పదార్థాలు: బాదం జిగురు (ఆల్మండ్ పిసిన్)- మూడు చెంచాలు, కండెన్స్‌డ్ మిల్క్- మూడు చెంచాలు, నన్నారీ సిరప్- మూడు చెంచాలు, చల్లటి పాలు- అరలీటరు, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం- తగినంత.
తయారీ: ఒక గిన్నెలో ఆల్మండ్ గమ్ వేసి, అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. దీన్నే హిందీలో గోంద్ అంటారు. అది ఉబ్బి దాని పరిమాణం రెండింతలవుతుంది. జెల్లీలా తయారవుతుంది. దానిపై గోధుమరంగులో పొట్టు ఏమైనా ఉంటే తొలగించి, నీటిని వడకట్టుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకుని అందులో కండెన్స్‌డ్ మిల్క్, నన్నారీ సిరప్, చల్లటి పాలు వేసి కలపాలి. ఒక గ్లాసులో కాస్త ఆల్మండ్ గమ్ వేసి, దాంట్లో పాలమిశ్రమం పోసుకోవాలి. బాగా కలుపుకొని దానిపై రెండు స్కూపుల ఐస్‌క్రీం వేసుకోవాలి. పైన కూడా కొద్దిగా నన్నారి సిరప్‌ని చల్లుకొని డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకుంటే చల్లచల్లటి జిగర్ తండా తయార్.. ఇంకేముంది.. సర్వ్ చేసుకుని, తాగేయడమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!