మేలు చేసే మల్బరీ..

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో మల్బరీ ఒకటి. వీటినే బొంతపండ్లు అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో వీటికి గిరాకీ పెరగటం, రైతులకు లాభదాయకంగా ఉండటం వల్ల ఎక్కువగా సాగు చేస్తున్నారు.

Updated : 14 May 2023 00:35 IST

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో మల్బరీ ఒకటి. వీటినే బొంతపండ్లు అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో వీటికి గిరాకీ పెరగటం, రైతులకు లాభదాయకంగా ఉండటం వల్ల ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిని డ్రైఫ్రూట్‌లాగా కూడా ఉపయోగిస్తారు. ఎండిన 100 గ్రాముల బెర్రీస్‌లో 362 కెలొరీలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్‌, పెక్టిన్‌ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. పేగుల్లో ఇమ్యునిటీ తగ్గటానికి కారణం ఫైబర్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటమేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్‌ సి, కె ఉండటం మూలంగా మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో ఉండే బ్యాక్టీరియాని నిర్మూలించడానికి కూడా మల్బరీస్‌ చక్కగా దోహదపడతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను సమన్వయం చేస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారూ తీసుకోవచ్చు. ఇతర దేశాల్లో మధుమేహానికి తయారు చేసే ఔషదాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారట.


చార్మినార్‌ దగ్గర దొరికే వంటకాల్లో మల్బరీ క్రీం కూడా ఒకటి. దీన్ని మల్బరీలు, పాల మీగడ, పంచదారతో చేస్తారు. చార్మినార్‌ చూసేందుకు వచ్చిన పర్యటకులు దీని రుచి అమోఘంగా ఉంటుందని చెప్తుంటారు. ఈ సారి వెళ్లినప్పుడు మీరూ ప్రయత్నించి చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని