మస్త్‌... మస్త్‌ మటర్‌ చాట్‌!

కావాల్సినవి: పచ్చి బఠాణీ- కప్పు, నల్లుప్పు, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున, చక్కెర- అర చెంచా, జీలకర్ర, ధనియాల పొడి- చెంచా చొప్పున, అల్లం తరుగు, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున, పచ్చి

Published : 20 Feb 2022 00:11 IST

కావాల్సినవి: పచ్చి బఠాణీ- కప్పు, నల్లుప్పు, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున, చక్కెర- అర చెంచా, జీలకర్ర, ధనియాల పొడి- చెంచా చొప్పున, అల్లం తరుగు, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున, పచ్చి మిరపకాయలు- రెండు (తరగాలి), ఉప్పు- సరిపడా, నూనె- పెద్ద చెంచా.

తయారీ: పచ్చి బఠాణీలను నీళ్లలో  రాత్రంతా నానబెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడులు; చక్కెర, నల్లుప్పు, అల్లం తరుగు వేసి కలపాలి. ఆ తర్వాత కొన్నినీళ్లు పోసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. ఇందులో పచ్చిబఠాణీలు వేసి కలపాలి. అల్లం, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం వేసి అలంకరించి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని