ఒత్తిడిని తగ్గించే సబ్జా..

నల్లగా.. నువ్వుల్లా ఉండే సబ్జా గింజలు చేసే లాభాలు చాలా ఎక్కువే. బరువును తగ్గించడం నుంచి ఒత్తిడిని మాయం చేయడం వరకు వీటి వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు...

Updated : 03 Apr 2022 06:49 IST

నల్లగా.. నువ్వుల్లా ఉండే సబ్జా గింజలు చేసే లాభాలు చాలా ఎక్కువే. బరువును తగ్గించడం నుంచి ఒత్తిడిని మాయం చేయడం వరకు వీటి వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు...

* సబ్జా విత్తనాల్లో విటమిన్‌ ఎ, ఇ మెండుగా ఉంటాయి. ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా. ఈ విత్తనాలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.  

* జీవక్రియలను మెరుగుపరుస్తాయి.

* బరువునే కాదు రక్తపోటునూ నియంత్రిస్తాయి.

* వీటిలోని పీచు మలబద్దకం సమస్యను నివారించడంతోపాటు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

* కడుపులో మంటను తగ్గిస్తాయి.

* జలుబు, దగ్గులను తగ్గించడంలో ముందుంటాయి.

* ఒత్తిడి, ఆందోళనలను నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

* రక్తాన్ని శుద్ధి చేస్తాయివి.  

* ఈ విత్తనాలను నిమ్మ రసం, పండ్ల రసాలు, ఫ్రూట్‌ సలాడ్లు, మజ్జిగ, మిల్క్‌ షేక్స్‌లో కలిపి తీసుకుంటారు. వీటిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.

* రాత్రంత నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.

* ఈ గింజల్లో యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న వీటిని తీసుకోవడం వెంటనే మొదలుపెట్టండి మరి.

ఈ గింజలను నీళ్లలో నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని