అల్లంతో వయసు వెనక్కి!

కప్పు టీ పడందే రోజు ప్రారంభం కావడం లేదా? అయితే అందులో ఓ చిన్న అల్లం ముక్కని దంచి వేయండి. లేదంటే పూర్తిగా అల్లంతో చేసిన టీ డికాక్షన్‌నే తాగేయండి. బోలెడు ప్రయోజనాలు...

Updated : 07 Aug 2022 09:48 IST

పోషకాలం!

ప్పు టీ పడందే రోజు ప్రారంభం కావడం లేదా? అయితే అందులో ఓ చిన్న అల్లం ముక్కని దంచి వేయండి. లేదంటే పూర్తిగా అల్లంతో చేసిన టీ డికాక్షన్‌నే తాగేయండి. బోలెడు ప్రయోజనాలు...

* ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కీమోథెరపీ వంటి వైద్యాలు అందుకొంటున్నా కొందరికి వికారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ అల్లం చాయ్‌ని తాగితే ఉపశమనంగా ఉంటుంది. అల్లానికి క్యాన్సర్‌ని అదుపు చేసే శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

* బీపీ, గుండె జబ్బులున్న వారికి అల్లం టీ మేలు చేస్తుంది.

* వయసుతో పాటు మెదడులో కొన్ని మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మెదడులోని కొన్ని కణాలు నశించి వచ్చే అల్జీమర్స్‌ వంటి సమస్యలకు అల్లంలోని జింజరాల్‌ అనే రసాయనం చెక్‌ పెడుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే ఉదయం పూట కాస్త ఘాటుగా ఉండే అల్లం చాయ్‌ని తాగారంటే వయసుతో పని లేకుండా మెదడు చురుగ్గా ఉంటుంది.

* బరువు తగ్గాలనుకొనేవారికీ, మోకీళ్లలో నొప్పులు, వాపులు ఉన్నవారికీ ఇది మంచి ఔషధం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని