Coffee: ఈ కాఫీ ఒక్కసారి తాగితే.. 40 ఏళ్లు గుర్తుంటుందట!

ఏ దేశానికయినా సంస్కృతి వారసత్వ సంపదలు అంటే ఏం గుర్తుకొస్తాయి? ఆలయాలో, కట్టడాలో కదా! కానీ టర్కీ వారసత్వ సంపదల్లో కాఫీ కూడా ఉండటం విశేషం. ఆశ్చర్యంగా ఉందా.. పదేళ్ల క్రితం యునెస్కో కూడా దీన్ని వారసత్వ సంపదల

Updated : 18 Sep 2022 09:37 IST

ఏ దేశానికయినా సంస్కృతి వారసత్వ సంపదలు అంటే ఏం గుర్తుకొస్తాయి? ఆలయాలో, కట్టడాలో కదా! కానీ టర్కీ వారసత్వ సంపదల్లో కాఫీ కూడా ఉండటం విశేషం. ఆశ్చర్యంగా ఉందా.. పదేళ్ల క్రితం యునెస్కో కూడా దీన్ని వారసత్వ సంపదల జాబితాలోకి చేర్చింది. టర్కీలో దొరికే ప్రత్యేకమైన కాఫీ గింజల్ని యంత్రాలతో కాకుండా చేతులతో దంచి కాఫీ పొడి తయారుచేస్తారు. అలా దంచిన కాఫీపొడిని ప్రత్యేకంగా రూపొందించిన కంచుపాత్రల్లో ఉంచి.. వేడివేడి ఇసుకమీద మరగకాస్తారు. అలా కాచిన కాఫీ రుచిని ఒక్కసారి రుచి చూసినా నలభై ఏళ్లు గుర్తుండిపోతుందని స్థానికులు అంటూ ఉంటారు. కాఫీ తయారీలో ఎన్నో ఆధునిక పద్ధతులు వచ్చినా... టర్కీ కాఫీ రుచికి ఇంతవరకూ పోటీ లేకపోవడం విశేషం. అంత అద్భుతంగా ఉంటుందట కాఫీ రుచి. అందుకే ఈ కాఫీని అరేబియన్‌ వైన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని