భోజనానికి ముందు... తర్వాతా!

హెటల్‌కెళ్తే భోజనం తర్వాత... తప్పనిసరిగా కాసిని సోంపు పలుకులు రుచి చూస్తాం. లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. నోటికి తాజా పరిమళం ఇవ్వడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనీ ఈ సోంపు అందిస్తుంది...

Updated : 11 Dec 2022 00:44 IST

హెటల్‌కెళ్తే భోజనం తర్వాత... తప్పనిసరిగా కాసిని సోంపు పలుకులు రుచి చూస్తాం. లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. నోటికి తాజా పరిమళం ఇవ్వడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనీ ఈ సోంపు అందిస్తుంది...

* సాధారణంగా భోజనం తర్వాత అరుగుదల కోసమని సోంపు తింటాం కదా.. ఈసారి టిఫిన్‌కీ, భోజనానికి మధ్య కాసిని గింజలు నమిలి చూడండి. ఇలా చేయడం వల్ల మనం సాధారణంగా తినేదానికన్నా తక్కువ తింటామట. దాదాపుగా పదిశాతం తక్కువ కెలొరీలు అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

* దీనిలో పీచు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సోంపు తిన్న తర్వాత మళ్లీ ఇంకా ఏదో తినాలన్న కోరిక ఉండదు. కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకొనేవారు సోంపుని అలవాటు చేసుకుంటే మంచిది.

* సోంపుతో చేసిన టీని ఎప్పుడైనా తాగారా? వారంలో ఒకసారైనా తాగండి. మూత్ర సమస్యలుంటే తొలగిపోతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

* దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లకి ఒత్తిడిని అదుపులో ఉంచే శక్తి ఉంది.

* మంచి నిద్ర పట్టించి, అలసట లేకుండా చేస్తాయి సోంపు గింజలు. దాంతో తెల్లారి చురుగ్గా ఉంటూ వ్యాయామం చేయాలన్న కోరిక మనలో కలుగుతుందట. రక్తాన్ని శుద్ధిచేస్తుందీ సోంపు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని