ఈ రాళ్లను తినేయొచ్చు!

చూడ్డానికి ఇవేవో విలువైన వజ్రాల్లా, పచ్చల్లా ఉన్నాయి కదా? కానీ ఇవన్నీ క్యాండీలంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. జపాన్‌లో ప్రత్యేకంగా తయారు చేసే ఈ స్వీట్లని కొహాకూటౌ అనీ... ఎడిబుల్‌ క్రిస్టల్స్‌ అనీ అంటారు.

Updated : 07 Nov 2021 00:57 IST

చూడ్డానికి ఇవేవో విలువైన వజ్రాల్లా, పచ్చల్లా ఉన్నాయి కదా? కానీ ఇవన్నీ క్యాండీలంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. జపాన్‌లో ప్రత్యేకంగా తయారు చేసే ఈ స్వీట్లని కొహాకూటౌ అనీ... ఎడిబుల్‌ క్రిస్టల్స్‌ అనీ అంటారు. ముద్దుగా ‘తినే నగలు’ అని కూడా పిలుచుకుంటారు. సముద్రంలో దొరికే అగర్‌అగర్‌ నాచుని వాడి వీటిని చేస్తారు. చూడ్డానికి రాళ్లలా ఉన్నా... లోపల ఇవి మెత్తగా జెల్‌ తరహాలో ఉండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయట. ప్రపంచవ్యాప్తంగా వీటితో తయారుచేసిన కేకులకి ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని