ఈ మోమోలకు... కోటి మంది ఫిదా!
మోమోస్ తెలుసా! చూడ్డానికి కజ్జికాయల్లా ఉండే వీటిని ఆవిరిమీద ఉడికించి చేస్తారు. రుచిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే మోమోలని మరింత సృజనాత్మకంగా తయారుచేసి శభాష్ అనిపించుకుంటోంది సూరత్ అమ్మాయి వర్షసింగ్.
మోమోస్ తెలుసా! చూడ్డానికి కజ్జికాయల్లా ఉండే వీటిని ఆవిరిమీద ఉడికించి చేస్తారు. రుచిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే మోమోలని మరింత సృజనాత్మకంగా తయారుచేసి శభాష్ అనిపించుకుంటోంది సూరత్ అమ్మాయి వర్షసింగ్. ఈమె చేసిన మోమోలని ఇంతవరకూ 13 మిలియన్ల మంది చూశారు..
కాలేజీ అమ్మాయి వర్షసింగ్ తయారుచేస్తున్న మోమోలకి ఇంతగా ఆదరణ రావడానికి కారణం వాటిని ఆమె తయారుచేసిన విధానమే. మైదాని చపాతీల్లా ఒత్తి... అందులో క్యాబేజీ, క్యారెట్, బీన్స్ వంటివాటిని చిన్నముక్కలుగా తరిగి ఉంచి ఆవిరిమీద ఉడికిస్తారు. ఇవి చూడ్డానికి చిన్న చిన్న మూటల్లా ఉంటాయి. ఆ పక్కనే సాస్‌లు ఇస్తారు. వర్ష మాత్రం కాస్త భిన్నంగా ఈ మోమోస్‌ని నాలుగు గళ్లు ఉండేలా తయారుచేసింది. ఆ గడుల్లో గ్రీన్‌చట్నీ, టొమాటోసాస్, తందూరీసాస్, మయొనీస్ వంటివి వేసి అందిస్తోంది.
సామజిక మాధ్యమాల్లో ఇవి షాట్ మోమోస్ పేరుతో వైరల్ అవుతున్నాయి. ఇంతవరకూ ఈ వీడియో కోటీముప్ఫైలక్షలమంది చూశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్