నిమిషాల్లో తియ్యటి మిఠాయి

మనం తరచూ తినే వాటితో పాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదూ! అందుకే వంటల వీడియోల్లో చూసిన కొన్నిటిని.. నాదైన పద్ధతిలో ప్రయత్నిస్తుంటాను. అలా చేసిందే ‘బియ్యం మిఠాయి’.

Published : 02 Jun 2024 01:01 IST

పాఠక వంట

నం తరచూ తినే వాటితో పాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదూ! అందుకే వంటల వీడియోల్లో చూసిన కొన్నిటిని.. నాదైన పద్ధతిలో ప్రయత్నిస్తుంటాను. అలా చేసిందే ‘బియ్యం మిఠాయి’. చాలా బాగా కుదిరింది. ఎలా చేయాలంటే.. నెయ్యిలో బియ్యం వేయించాలి. జాలీ గరిటెతో పü˘్లంలోకి తీసి, చల్లారాక.. మిక్సీ జార్‌లో వేయాలి. పావు కేజీ బియ్యానికి పన్నెండు చొప్పున బాదం, జీడిపప్పులను కూడా వేయించాలి. అన్నీ కలిపి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో అర్ధపావు పంచదారను వేడిచేసి క్యారమెల్‌ తయారుచేయాలి. అందులో బియ్యం, డ్రైఫ్రూట్స్‌ కలిసిన పొడి, పావు చెంచా యాలకుల పొడి, ఒక గ్లాసు పాలు, రెండు చెంచాల నెయ్యి జతచేయాలి. ఉండలు కట్టకుండా కలియ తిప్పుతుండాలి. దగ్గరగా అయ్యాక సెగ తీసేయాలి. ఒక పü˘్లంలో నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని సమంగా సర్ది, నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసి, పిస్తా పలుకులు చల్లితే సరి.. ‘బియ్యం మిఠాయి’ సిద్ధం. పిల్లలు ఒకసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. ఇదెంతో టేస్టీగానూ ఉంటుంది, ఆరోగ్యానికీ మంచిది. నచ్చితే మీరూ చేసి చూడండి, తేలిగ్గానే అయిపోతుంది.

మండపాక అరుణ కుమారి, హైదరాబాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని