తియ్యటి బిస్కెట్‌ మిఠాయి

పిల్లలకు కొత్త కొత్త రుచులు కావాలంటారు కదా! అలా అడిగినప్పుడు చేసిన స్వీట్‌ ఇది. దీనికి మైదాపిండి, జీడిపప్పు, మిల్క్‌ పౌడర్, నెయ్యి, పాలు, పంచదార, నూనె మొదలైనవి అవసరమౌతాయి.

Published : 23 Jun 2024 00:50 IST

పిల్లలకు కొత్త కొత్త రుచులు కావాలంటారు కదా! అలా అడిగినప్పుడు చేసిన స్వీట్‌ ఇది. దీనికి మైదాపిండి, జీడిపప్పు, మిల్క్‌ పౌడర్, నెయ్యి, పాలు, పంచదార, నూనె మొదలైనవి అవసరమౌతాయి. ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో రెండు కప్పుల మైదాపిండి, ముప్పావు కప్పు వెచ్చటి పాలు, ఓ కప్పు మిల్క్‌ పౌడర్, పావు కప్పు జీడిపప్పు పొడి, చిటికెడు ఉప్పు, మూడు చెంచాల నెయ్యి, పావు చెంచా యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మెత్తటి పిండి తయారయ్యాక.. చపాతీ కర్రతో చిన్న చిన్న అప్పాల్లా చేయాలి. లేదా మందమైన పెద్ద రొట్టె చేసి.. నచ్చిన ఆకృతిలో ముక్కలు కట్‌ చేయవచ్చు. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. మరో పాత్రలో కప్పు పంచదార, కప్పు నీళ్లు, కచ్చాపచ్చా దంచిన పిస్తా పప్పులు, కాస్త యాలకుల పొడి, కొంచెం కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. చిక్కగా అయ్యాక సెగ తీసేసి.. ఈ పాకాన్ని బిస్కెట్ల మీద పోసి, మూత పెట్టాలి. రెండు గంటలు పాకంలో నానితే చాలు.. తియ్యటి మిఠాయి సిద్ధం. నచ్చితే మీరూ చేసి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని