మధురమైన గుల్‌గులేలు

గోధుమ పిండి- ఒకటిన్నర కప్పు, బెల్లం- అర కప్పు, యాలకుల పొడి- చిటికెడు, వంటసోడా- చెంచా, నూనె- వేయించడానికి సరిపడా.

Published : 13 Feb 2022 01:38 IST

కావాల్సినవి: గోధుమ పిండి- ఒకటిన్నర కప్పు, బెల్లం- అర కప్పు, యాలకుల పొడి- చిటికెడు, వంటసోడా- చెంచా, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: బెల్లాన్ని తురిమి పావు కప్పు నీళ్లు పోసి పాకం పట్టాలి. లేత పాకం పడితే సరిపోతుంది. మరీ గట్టిపడాల్సిన పనిలేదు. ఆ తర్వాత పాకాన్ని చల్లారనివ్వాలి. దీంట్లో గోధుమ పిండి, వంటసోడా, యాలకుల పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగాను, మరీ పలుచగానూ ఉండకూడదు. చేతులకు నూనె రాసుకుని కాస్త పిండిని తీసుకుని ఉండల్లా చేసుకుని కాగిన నూనెలో వేసుకోవాలి. మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. వీటి తయారీ మన పాకం ఉండల మాదిరిగానే ఉంటుంది గానీ గోధుమ పిండితో చేస్తారు. బెంగాలీలు ఎంతో ఇష్టంగా తినే ఈ గుల్‌గులేలు పది రోజులు నిల్వ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు