ఇడ్లీ బజ్జీ చేద్దామా!

ఉదయం అల్పాహారంలో చాలామంది ఇడ్లీ తింటారు. సాయంకాలంపూట స్నాక్స్‌లా బజ్జీ ల్లాంటివి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలా ఉంటుంది? ఇడ్లీ బజ్జీలా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు. ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతుంటాయి.

Published : 10 Apr 2022 01:26 IST

ఉదయం అల్పాహారంలో చాలామంది ఇడ్లీ తింటారు. సాయంకాలంపూట స్నాక్స్‌లా బజ్జీ ల్లాంటివి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలా ఉంటుంది? ఇడ్లీ బజ్జీలా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు. ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతుంటాయి. అలాంటి సమయంలో ఇలా ట్రై చేసి చూడండి.  

కావాల్సినవి: ఇడ్లీలు- నాలుగు (నిలువుగా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి), శనగపిండి- అయిదు చెంచాలు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం, జీలకర్ర పొడి, వాము- అర చెంచా చొప్పున; వంటసోడా- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, వాము, జీలకర్ర పొడి, వంటసోడా వేసి, తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. ఇది వేడయ్యాక ఇడ్లీ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. టేస్టీ ఇడ్లీ బజ్జీలు రెడీ. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.  

- శ్రీలత, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని