తింటే రామ్‌లడ్డూనే తినాలి!

రామ్‌ లడ్డూ పేరు విన్నారా.. ఇది దిల్లీ వీధుల్లో చాలా ఫేమస్‌. సాయంత్రం వేళల్లో ఈ లడ్డూ కోసం ఆహారప్రియులు ఈ బళ్ల  దగ్గర క్యూ కడతారు.

Published : 07 May 2023 00:06 IST

రామ్‌ లడ్డూ పేరు విన్నారా.. ఇది దిల్లీ వీధుల్లో చాలా ఫేమస్‌. సాయంత్రం వేళల్లో ఈ లడ్డూ కోసం ఆహారప్రియులు ఈ బళ్ల  దగ్గర క్యూ కడతారు. సాధారణంగా లడ్డూ అంటే తియ్యగా ఉంటుందని అనుకుంటాం.. కానీ ఈ రామ్‌లడ్డూ మాత్రం హాట్‌ రెసిపీనే. పెసరపిండి, సెనగపిండి, ఇంకొన్ని మసాలాలు, ఆకుకూరలు వేసి ఈ పిండిని తయారు చేస్తారు. చిన్నచిన్న బోండాల్లాగా వేసి నూనెలో డీప్‌ ఫ్రై చేస్తారు. ఇక సన్నగా తరిగిన ముల్లంగి, గ్రీన్‌ చట్నీ, రెడ్‌ చట్నీతో సర్వ్‌ చేసే ఈ రామ్‌లడ్డూని తింటే దిల్లీలోనే తినాలంటారు ఇక్కడి ప్రజలు. బుజ్జి విస్తరాకుల్లో వేడిగా సర్వ్‌ చేసే కరకరలాడే ఈ బోండాకి చాలా మందే అభిమానులున్నారు.

పొరుగు రుచి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు