తోతాపురి మామిడి పచ్చడి

మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తురమాలి...

Updated : 15 Jun 2021 12:46 IST

పాఠక వంట

తయారీ: మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తురమాలి. కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి వేయించాలి. తర్వాత మామిడిముక్కలు, ఉప్పు వేసి మరికాసేపు వేయించాలి. మామిడి ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి చల్లార్చాలి. నువ్వులను నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన మామిడిముక్కలు, అల్లం తురుములో నువ్వులు వేసి మిక్సీజార్‌లో మెత్తగా పేస్టు చేయాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి వేసి  తాలింపు పెట్టాలి. ఇది అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి బాగుంటుంది.
కావాల్సినవి: తోతాపురి పచ్చి మామిడికాయ- ఒకటి, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- నాలుగు, నువ్వులు- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత. తాలింపు కోసం: జీలకర్ర, ఆవాలు- అర టీస్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఒకటి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని