Updated : 15 Jun 2021 12:45 IST

హుమ్మస్‌... అదుర్స్‌!

పొరుగు రుచి

డ్లీ, దోసె, వడల్లాంటి టిఫిన్లను మనం చట్నీలో నంజుకుని తింటుంటాం కదా... అలాగే మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవాళ్లు ‘హుమ్మస్‌’ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. బ్రెడ్‌ను దీంట్లో ముంచుకుని తింటే భలే ఉంటుందంటారు. ఇంతకీ దీన్నెలా చేస్తారంటే... పెద్ద సెనగలను ఉడికించి, నీళ్లు వడకట్టి దాంట్లో నువ్వులు, వెల్లుల్లిరేకలు వేసి మెత్తగా మిక్సీ పడతారు. చివరగా కాస్త నిమ్మరసం పిండుతారు. అలాగే ఉడికించిన సెనగల్లో బీట్‌రూట్‌ కలిపితే గులాబీరంగు హుమ్మస్‌ సిద్ధమవుతుంది. దీంట్లో పాలకూరను కలిపితే పచ్చపచ్చగా, చూడముచ్చటగా ఉండి కనువిందు చేస్తుంది. రకరకాల రంగులు, రుచుల్లోని హుమ్మస్‌లు ఇప్పుడు అమెరికా సూపర్‌ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటున్నాయట. అయినా కమ్మగా, రుచిగా ఉండే సెనగల పచ్చడి పాశ్చాత్యుల మనసులనూ దోచేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని