మేలు చేసే మునగాకు!
పోష కాలమ్
మునగాకు తింటే ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.... ఇలా ఈ ఆకు వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
* మునగాకులో బీటాకెరొటిన్ దండిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* ఈ ఆకుల నుంచి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. కూర, పప్పు, వేపుడు, పొడి... ఇలా వివిధ రకాలుగా మునగాకును ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదు.
* పాలతో పోలిస్తే మూడొంతుల క్యాల్షియం ఇందులో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకు నుంచి దాదాపు నాలుగు వందల మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది. దీన్ని పొడిలా, కూరల్లో వేసుకుని తీసుకుంటే ఎముక సంబంధ సమస్యలు తలెత్తవు.
* మునగాకులోని కొన్ని రసాయనాలు రక్తనాళాలు గట్టిగా మారకుండా చూస్తాయి. వీటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించే ఔషధగుణాలుంటాయి.
* దీనిలోని పీచు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు కొవ్వును బయటకు పంపేస్తుంది. కాబట్టి ఊబకాయులు తమ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు.
* ఈ ఆకుల్లో విటమిన్-సి కూడా మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
* వీటిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. పీచు రక్తస్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. మధుమేహులు ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఆకులను తరచూ తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
* మునగలోని ఫైటోకెమికల్స్, పాలీఫినాల్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhanush: మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం: ధనుష్
-
General News
Telangana News: బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్: మంత్రి హరీశ్‌రావు
-
India News
‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్
-
Sports News
Virat Kohli : విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు