పచ్చడి నిల్వ ఉండాలంటే?

ఈ కాలంలో చాలామంది ఉసిరి పచ్చడి పెడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి రుచితోపాటు నిల్వ చేసుకోవడం కూడా సులభమే.

Updated : 20 Nov 2022 06:36 IST

*నాకు ఉసిరికాయ పచ్చడి పెట్టాలని ఉంది. కానీ చాలామంది అది నిల్వ ఉండదు.. పాడవుతుందని అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

* ఈ కాలంలో చాలామంది ఉసిరి పచ్చడి పెడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి రుచితోపాటు నిల్వ చేసుకోవడం కూడా సులభమే. నిల్వ పచ్చడిని రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి మొత్తం ఉసిరికాయలతో పెట్టేది. రెండోది.. ఉసిరి ముక్కలతో పెట్టేది. ఏ రకం పచ్చడి పెట్టినా తాజా ఉసిరినే ఎంచుకోవాలి. అలాగే ఇందుకు పెద్ద కాయలనే తీసుకోవాలి. చిన్నవి పచ్చిగా వగరుగా ఉంటాయి. పచ్చడి రుచి రాదు. అలాగే మచ్చలు లేని రకాల్ని ఎంచుకోవాలి. ఉసిరికాయల్ని కడిగిన తర్వాత చెమ్మలేకుండా ఓ వస్త్రంతో తుడిచిపెట్టుకోవాలి. కాసేపు ఎండలో ఉంచినా ఫర్వాలేదు. పచ్చడిలోకి ఉపయోగించే పసుపు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని కూడా కాసేపు ఎండలో ఉంచి వాడుకుంటే మంచిది. పచ్చడిని గాజుపాత్రలోకానీ, పింగాణి పాత్రలో కానీ కలుపుకోవాలి. ఎక్కువ వాసన ఉండే నూనెలు వాడకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బూజుపట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.


శ్రీదేవి,
హోటల్‌ మేనేజిమెంట్‌ నిపుణురాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని