షడ్రుచులతో ఉగాదిని ఆహ్వానిద్దాం..

నేను ఏ సంవత్సరం ఉగాది పచ్చడి చేద్దామన్నా దాంట్లోకి కావల్సిన అన్ని వస్తువులు నాకు ఇక్కడ దొరకవు. అందులో వాడే ఆరు రుచులకు ప్రత్యామ్నాయంగా ఏమైనా వాడొచ్చా తెలియజేయండి?

Updated : 19 Mar 2023 00:54 IST

నేను ఏ సంవత్సరం ఉగాది పచ్చడి చేద్దామన్నా దాంట్లోకి కావల్సిన అన్ని వస్తువులు నాకు ఇక్కడ దొరకవు. అందులో వాడే ఆరు రుచులకు ప్రత్యామ్నాయంగా ఏమైనా వాడొచ్చా తెలియజేయండి?

రమ్య, కోల్‌కతా

కావాల్సిన పదార్థాలు: వేపపూత- కొద్దిగా, చింతపండు- చిన్న నిమ్మకాయంత, కారం- అరచెంచా, బెల్లం- 50గ్రాములు, ఉప్పు- పావుచెంచా, మామిడికాయ పిందె ఒకటి. కావాల్సినంత పరిమాణానికి తగ్గట్టుగా పదార్థాలు తీసుకోవాలి.

తయారీ విధానం.. ముందుగా చింతపండు 45నిమిషాల పాటు నానబెట్టి గుజ్జును తీసుకోవాలి. ఒక వేళ చింతపండు అందుబాటులో లేకపోతే నిమ్మకాయని ఉపయోగించొచ్చు. వగరు కోసం మామిడికాయ పిందెను తీసుకొని చెక్కు తీసి సన్నగా తరగాలి. వేపపూత కాడల నుంచి వేరుచేసి తెల్లగా ఉండే పూరెబ్బలను మాత్రమే తీసుకోవాలి. ఒక వేళ వేపపూత అందుబాటులో లేకపోతే నానబెట్టిన మెంతులు, మెంతుల పొడి కూడా వాడొచ్చు. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, మనకి కావాల్సినంత పరిమాణంలో మంచినీళ్లు పోయాలి. దాంట్లో బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. బెల్లం లేకపోతే దీనికి బదులు చెరకు రసం, కారానికి బదులు పచ్చిమిర్చి కానీ, మిరియాలు కానీ ఉపయోగించొచ్చు. అంతే ఎంతో రుచికరమైన తెలుగువారి ఉగాది పచ్చడి తయారైపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని