వారెవా పెండలం పచ్చడి..
కంద దుంప చాలామందే తింటారు కానీ.. పెండలం కాస్త అరుదు. దానితో కూరే కాదు, రోటి పచ్చడి కూడా చేయొచ్చు. నేను పెండలంతో నిలవ పచ్చడి చేస్తాను.
కంద దుంప చాలామందే తింటారు కానీ.. పెండలం కాస్త అరుదు. దానితో కూరే కాదు, రోటి పచ్చడి కూడా చేయొచ్చు. నేను పెండలంతో నిలవ పచ్చడి చేస్తాను. ఇదెంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా మహా సులువు. ఈ పచ్చడి కోసం.. ముందుగా పెండలం చెక్కు తీసి, కడిగి, ముక్కలు కోసి.. తడి లేకుండా ఒక శుభ్రమైన వస్త్రం మీద ఆరబెట్టాలి. కిలో పెండలం ముక్కలకి పావు కిలో చింతపండు, పావు కిలో కారం, అర్ధ పావు ఉప్పు సరిపోతాయి. ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్లు ఇంకాస్త వేసుకోవచ్చు. కారం, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇందులో ఉడకబెట్టి, రుబ్బిన చింతపండు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి కలిపి తాలింపు వేస్తే సరి.. ఘుమఘుమ లాడే పెండలం పచ్చడి సిద్ధమైపోయినట్లే. రుచిగా ఉండే ఈ పచ్చడి అన్నంలోనే కాదు, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరూ ఒకసారి చేసి చూడండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న