Sharbat: షర్బత్‌తో మజా.. మజా!
ఎండల్లో చల్లని పానీయాలు ఇచ్చే హాయి ముందు ఏ రుచైనా బలాదూరే! చిన్నప్పుడు అమ్మమ్మలు చేసి పెట్టే నిమ్మకాయ షరబత్ మనందరికీ తెలిసిందే!
ఎండల్లో చల్లని పానీయాలు ఇచ్చే హాయి ముందు ఏ రుచైనా బలాదూరే! చిన్నప్పుడు అమ్మమ్మలు చేసి పెట్టే నిమ్మకాయ షరబత్ మనందరికీ తెలిసిందే! పండ్లు, పాలు జోడించి చేసే నయా షర్బత్‌లు ఎలా చేయాలో చూద్దామా..
రోజ్ షర్బత్..
కావల్సినవి: రోజ్ సిరప్- రెండు చెంచాలు, నానబెట్టిన సబ్జా గింజలు- చెంచా, నిమ్మకాయ రసం- రెండు చెంచాలు, సోడా- గ్లాసు, పంచదార సిరప్- చెంచా.
తయారీ: ఒక గిన్నెలో రోజ్ సిరప్, నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మకాయరసం, పంచదార సిరప్ వేసి కలపాలి. తర్వాత దాంట్లో తగినంత సోడా పోసుకొని సర్వ్ చేసుకోవటమే..
నిమ్మకాయ, అల్లంతో..
కావల్సినవి: నిమ్మకాయ- ఒకటి, అల్లం- అంగుళం ముక్క, పంచదార సిరప్- 50 మి.లీ, ఐస్‌ముక్కలు- కొద్దిగా.
తయారీ: దంచిన అల్లంలో నిమ్మకాయ పిండాలి. దాన్ని టీ గరిటెలో వేసుకోని స్పూన్‌తో గట్టిగా నొక్కి వడకట్టాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో షుగర్ సిరప్, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే నిమ్మకాయ, అల్లం షర్బత్ తయారైనట్టే.
కర్బూజతో..
కావల్సినవి: కర్భూజ ముక్కలు- ఒకటిన్నర కప్పు, పాలు- లీటరు, కస్టర్డ్ పౌడర్- రెండు చెంచాలు, యాలకులపొడి- అరచెంచా, పంచదార- అర కప్పు, సబ్జాగింజలు- రెండు చెంచాలు, సగ్గుబియ్యం- అరకప్పు.
తయారీ: సబ్జాగింజలు, సగ్గుబియ్యం అరగంట ముందు నీళ్లల్లో నానబెట్టుకోవాలి. తర్వాత పాలు గిన్నెలో పోసుకొని సన్నమంటపై పొయ్యి మీద పెట్టుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పాలల్లో పోయాలి. దాంట్లో రెండు చెంచాల పంచదార, యాలకుల పొడీ వేసి కలపాలి. అయిదు నిమిషాలు మరగనిచ్చి దింపాలి. కప్పు కర్భూజ, రెండు చెంచాల పంచదార వేసి మిక్సీ వేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో సగ్గుబియ్యం వేసి అవి మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత వాటిని వడకట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కస్టర్డ్‌పాలు, కర్భూజ గుజ్జు, సగ్గుబియ్యం, సబ్జా వేసి కలపాలి. మిగిలిన కర్భూజని సన్నగా తరిగి దీంట్లో వేసుకొని ఓ అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవటమే.
పుచ్చకాయతో..
కావల్సినవి: పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు , పంచదార- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- కొద్దిగా, నల్ల ఉప్పు- అరచెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, జీలకర్ర పొడి- చెంచా, ఐస్‌ముక్కలు- కొద్దిగా.
తయారీ: పుచ్చకాయ ముక్కలు, పంచదార, పుదీనా తరుగు అరచెంచా, పంచదార మిక్సీలో వేసి మెత్తగా తిప్పుకున్నాక, వడకట్టాలి. పంచదారకు బదులుగా నన్నారి సిరప్ కూడా వాడొచ్చు. దాంట్లో నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్లఉప్పు, ఐస్ వేసి సర్వ్ చేసుకోవటమే. పుచ్చకాయ షర్బత్ రెడీ..
సోంపుతో..
కావల్సినవి: సోంపు- రెండు చెంచాలు, పటిక బెల్లం- పావు కప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, ఐస్‌ముక్కలు- కొద్దిగా..
తయారీ: ఒక గిన్నెలో సోంపుని తీసుకొని చేత్తో కొద్దిగా మెదపాలి. తర్వాత దాంట్లో పటిక బెల్లం వేసుకొని, తగినన్ని నీళ్లుపోసి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత పైకి తేరుకున్న సోంపుని ఇంకోసారి చేత్తో మెదపాలి. ఇప్పుడు ఆ నీళ్లను వడకట్టుకొని, నిమ్మరసం, ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరి.
డ్రైఫ్రూట్స్‌తో...
కావల్సినవి: బాదం- పావుకప్పు, జీడిపప్పు- పావుకప్పు, పిస్తా- పావుకప్పు, పంచదార- అరకప్పు, పాలు- లీటరు, కస్టర్డ్ పౌడర్- రెండుచెంచాలు, కుంకుమ పువ్వు- చిటికెడు, ఐస్‌ముక్కలు- కొద్దిగా, యాలకుల పొడి- అరచెంచా.
తయారీ: ఒక గంట ముందుగా డ్రైఫ్రూట్స్‌ని కొద్దిగా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. బాదం పొట్టుతీసి ఉంచాలి. ఒక గిన్నెలో పాలు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. కొద్దిగా మరిగాక దాంట్లో కుంకుమ పువ్వు, పంచదార వేసి కలపాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్‌లో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలలో వేసి తిప్పాలి. అది చిక్కబడుతుంటే డ్రైఫ్రూట్స్‌ని మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా పాలలో వేసి కలియబెట్టాలి. కొద్దిగా చిక్కబడగానే దింపాలి. అది పూర్తిగా చల్లారాక ఐస్‌ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవటమే..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chocolate: చనిపోతావని జాతకం చెప్పి.. చాక్లెట్‌తో చంపేసి..!
-
TS Assembly Elections: బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల.. ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడి నుంచంటే..?
-
viral video: నాందేడ్ ఆస్పత్రి డీన్‌తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!
-
PM Modi: కేసీఆర్ ఎన్డీయేలో చేరతామన్నారు: మోదీ
-
India vs Netherlands: టాస్ పడకుండానే భారత్- నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
-
NewsClick raids: 500మంది పోలీసులు.. 100 ప్రాంతాలు: ‘న్యూస్‌క్లిక్’పై విస్తృత సోదాలు