మజా మజా మెక్సికన్ రోల్స్..!
మెక్సికన్ బ్రెడ్‌రోల్స్
కావలసినవి
బ్రెడ్ స్లైసెస్:పది,స్వీట్ కార్న్‌పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు: పావు కప్పు, వెన్న: టేబుల్ స్పూను, మైదా: టేబుల్ స్పూను, పాలు: అరకప్పు, ఎండుమిర్చిముక్కలు: అర టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* స్వీట్‌కార్న్ గింజల్ని కాస్త ఉడికించి తీయాలి.
* నాన్‌స్టిక్ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత మైదాపిండి వేసి కలుపుతూ ఓ నిమిషం ఉడికించాలి. తరవాత పాలు పోసి మీడియం మంటమీద రెండు నిమిషాలపాటు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, చీజ్ తురుము, ఎండుమిర్చి ముక్కలు, ఉప్పు వేసి ఓ నిమిషం ఉడికించిన తరవాత దించి విడిగా ఓ గిన్నెలో వేయాలి.
* బ్రెడ్ స్లైసెస్‌కి అంచుల్ని తీసేసి, అప్పడాల కర్రతో ఒకసారి అప్పడం మాదిరిగా వత్తాలి. ఇప్పుడు దాని మధ్యలో స్వీట్‌కార్న్ మిశ్రమాన్ని పెట్టి అంచుల దగ్గర తడిచేసి చాపలా చుట్టి అంచుల్ని మూసేయాలి. ఇలాగే అన్నీ చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని బ్లాటింగ్ పేపర్‌తో అద్ది టొమాటో సాస్‌తో వడ్డిస్తే సరి.
బాంగ్‌బాంగ్ బటాటా
కావలసినవి
బేబీ పొటాటో: పావు కిలో, ఉప్పు: తగినంత, కారం: టీస్పూను, పసుపు: అరటీస్పూను, బొంబాయిరవ్వ: టేబుల్‌స్పూను, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: మూడు, వెల్లుల్లి తురుము: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
* బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ఉంచాలి. ఓ గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, బొంబాయిరవ్వ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళాదుంపల్ని వేసి బాగా కలపాలి.
* నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. ఇప్పుడు కారం మిశ్రమం పట్టించిన బంగాళా దుంపల్ని కూడా వేసి సిమ్‌లో మరో పది నిమిషాలు ఉడికించి దించి, ఏదైనా చట్నీతో గానీ సాస్‌తోగానీ అందిస్తే సరి.
పనీర్ పకోడా
కావలసినవి
సెనగపిండి: ముప్పావుకప్పు, బియ్యప్పిండి: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, చాట్‌మసాలా: అరటీస్పూను, ఉప్పు: తగినంత, మంచినీళ్లు: అరకప్పు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, కసూరి మెంతి: టీస్పూను, పనీర్: 200గ్రా., నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* పనీర్ ముక్కల్ని చతురస్రాకారపు ముక్కల్లా కోయాలి. ఓ గిన్నెలో అర టీస్పూను చొప్పున కారం, చాట్‌మసాలా, అల్లంవెల్లుల్లి, కసూరిమెంతి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పనీర్ ముక్కలకు పట్టించాలి.
* సెనగపిండిలో బియ్యప్పిండి, పసుపు, మిగిలిన కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
* తరవాత సరిపడా నీళ్లు పోసి మిశ్రమాన్ని జారుగా కలపాలి. ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలిపి పనీర్ ముక్కల్ని ఇందులో ముంచి, కాగిన నూనెలో వేయించి తీసి సాస్‌తో వడ్డిస్తే సరి.
దాలియా కట్‌లెట్
కావలసినవి
లావు గోధుమరవ్వ: కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: కప్పు, పనీర్ తురుము: అరకప్పు, ఉల్లి, క్యాప్సికమ్ ముక్కలు: కప్పు చొప్పున, కొత్తిమీర తురుము: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: టీస్పూను, పసుపు: కొద్దిగా, గరంమసాలా: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, చాట్‌మసాలా: టీస్పూను, బియ్యప్పిండి: 2 టేబుల్‌స్పూన్లు, నూనె లేదా నెయ్యి: సరిపడా
తయారుచేసే విధానం
* గోధుమరవ్వలో కప్పు నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి. తరవాత నీళ్లు వంపేసి, రవ్వను అలాగే ఉంచాలి. తరవాత అందులో మిగిలిన అన్ని రకాల దినుసులూ వేసి మెత్తగా చేయాలి. చివరగా కాస్త బియ్యప్పిండి వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మనకు కావలసిన ఆకారంలో కట్‌లెట్స్‌లా చేసుకుని, నాన్‌స్టిక్ పాన్ మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీసి సాస్‌తో వడ్డించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!