పప్పుచెక్కలు కరకరలాడాలంటే...

పప్పు చెక్కల కోసం బియ్యప్పిండిలో చల్లటి నీళ్లని కాకుండా వేడినీళ్లు వాడాలి. నీళ్లను మరిగించుకుని అందులో ఇంగువ, ఉప్పు, కారం, బియ్యప్పిండి వేసి దించి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారాక అందులో కొద్దిగా వెన్న, నానబెట్టిన సెనగపప్పు,

Updated : 09 Dec 2022 13:35 IST

ప్ర-జ 

కొంతమంది పప్పు చెక్కలు చేస్తే చక్కగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. నేను చేస్తుంటే లావుగా వస్తాయి. కరకరలాడవు సరికదా... మెత్తగా, మందంగా వస్తున్నాయి. వాటిని అంత పల్చగా చేయడానికి ఏదైనా చిట్కా ఉందా?                                    - నవనీత

ప్పు చెక్కల కోసం బియ్యప్పిండిలో చల్లటి నీళ్లని కాకుండా వేడినీళ్లు వాడాలి. నీళ్లను మరిగించుకుని అందులో ఇంగువ, ఉప్పు, కారం, బియ్యప్పిండి వేసి దించి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారాక అందులో కొద్దిగా వెన్న, నానబెట్టిన సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం వేసుకోవాలి. ప్లాస్టిక్‌ పేపర్‌ కానీ అరటిఆకు కానీ తీసుకుని దానికి నూనె పట్టించుకోవాలి. దానిపై బియ్యప్పిండి ముద్దను ఉంచి మునివేళ్లతో ఒత్తితే పల్చగా, పెద్దగా వడలు వస్తాయి. వాటిని నూనెలో వేయించుకోవడమే.

-  శ్రీదేవి, హోటల్‌మేనేజిమెంట్‌ నిపుణురాలు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు