లివింగ్‌ రూం ఏ దిక్కున ఉండాలి?

ఇంటి నిర్మాణంలో గది గదికో ప్రత్యేకత.. ఆయా గదులను చాలావరకు వాస్తు ప్రకారమే చేపడుతున్నారు. సొంతంగా కట్టుకునేవారే కాదు.. కొనుగోలు చేసిన ఫ్లాట్లలోనూ ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లివింగ్‌ రూం వాస్తు ప్రకారం ఏ దిక్కున ఉండాలనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పెంటపాటి వాటికి సమాధానమిచ్చారు. లివింగ్‌ రూం ప్రత్యేకతే వేరు. ఇంటి విస్తీర్ణాన్నిబట్టి కొందరు ప్రధాన ద్వారం సమీపంలో ఏర్పాటు చేస్తే మరికొందరు ప్రత్యేకంగా హాల్‌లోనే మరోవైపు ఇందుకోసం కేటాయిస్తుంటారు. డ్రాయింగ్‌ రూం అని పేర్లు వేర్వేరుగా ఉన్నా ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతుంటారు.

Published : 01 May 2021 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నిర్మాణంలో గది గదికో ప్రత్యేకత.. ఆయా గదులను చాలావరకు వాస్తు ప్రకారమే చేపడుతున్నారు. సొంతంగా కట్టుకునేవారే కాదు.. కొనుగోలు చేసిన ఫ్లాట్లలోనూ ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లివింగ్‌ రూం వాస్తు ప్రకారం ఏ దిక్కున ఉండాలనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పెంటపాటి వాటికి సమాధానమిచ్చారు. లివింగ్‌ రూం ప్రత్యేకతే వేరు. ఇంటి విస్తీర్ణాన్నిబట్టి కొందరు ప్రధాన ద్వారం సమీపంలో ఏర్పాటు చేస్తే మరికొందరు ప్రత్యేకంగా హాల్‌లోనే మరోవైపు ఇందుకోసం కేటాయిస్తుంటారు. డ్రాయింగ్‌ రూం అని పేర్లు వేర్వేరుగా ఉన్నా ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అతిథులు వచ్చినా స్వాగతం పలికేది ఇక్కడే కాబట్టి అలంకరణకు శ్రద్ధ వహిస్తారు. యాజమానుల అభిరుచికి అక్కడి అలంకరణ వస్తువులు, ఫర్నిచర్‌ అద్దం పడుతుంటాయి.
* ఇల్లు ఏ దిక్కుకు ఉన్నా లివింగ్‌ హాలు మధ్యలో ప్రధాన ద్వారం ఉండాలి. అప్పుడే అన్నివైపుల గదుల్లో ఉన్నవారు హాలులోకి రావడానికి, అక్కడ గడపడానికి వీలుగా, సౌకర్యంగా ఉంటుంది. ఇల్లు విశాలంగా ఉన్నప్పుడే ఇది అనుకూలంగా ఉంటుంది.
* ఇల్లు చిన్నగా ఉండి ఉత్తరం దిశగా ఉంటే ఉత్తర ఈశాన్యంలో, దక్షిణంవైపైతే దక్షిణ అగ్నేయంలో, పడమర దిశలో ఇల్లు ఉంటే పడమర వాయువ్యంలో, తూర్పు దిక్కున ఉంటే తూర్పు ఈశాన్యంలో వాస్తు రీత్యా ఉత్తమం. విశాలంగా ఉండే ఇళ్లలోనూ ఈ దిక్కుల్లోనే నిర్మించుకోవచ్చు. లివింగ్‌ హాలు ఎల్‌, టీ ఆకారంలో ఉంటే కోరుకున్నట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు.
* టీ ఆకారంలో హాలు ఉంటే ఇంటికి ముందు భాగంలో లివింగ్‌హాలు, మరోపక్కన భోజనాల గదిగా వాడుకోవచ్చు. అదే టీ ఆకారంలో హాలైతే మూడో వైపు సిట్టింగ్‌ హాల్‌గా ఉపయోగించుకోవచ్చు. 

ఎంత విస్తీర్ణంలో మేలు

* స్థలం అందుబాటులో ఉన్నదాన్నిబట్టి 12x10, 15x10, 15x12 అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు.
* ఎల్‌ ఆకారంలో, టీ ఆకారంలో కుదిరితే మూడు దిక్కుల నుంచి పుష్కలంగా గాలి, వెలుతురు వస్తుంది. వీటికి బయటివైపు బాల్కనీ ఏర్పాట్లకు అనువుగా ఉంటాయి. మొక్కలు పెంచుకోవచ్చు.  అన్నికాలాల్లోనూ సౌకర్యంగా ఉంటుంది. ఇల్లు ఇరుకు అనే భావనే ఉండదు.

దీర్ఘచతురస్రమా.. చతురస్రమా..

స్థల లభ్యతనుబట్టి ప్రణాళిక రూపొందించుకోవాలి. దీర్ఘచతురస్రం ఆకారంలోని హాలు విశాలంగా కన్పిస్తుంది. చతురస్రం ఆకారంలో అయితే 12x12, 15x15, 18x18, 20x20 అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకుంటే సౌకర్యంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు